రామ్ తొలిసారిగా పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో ‘ఇస్మార్ట్ శంకర్’ అనే సినిమా చేస్తున్నారు. ఇందులో రామ్ తెలంగాణ కుర్రోడిగా నటించబోతున్నాడు. ఫస్ట్ లుక్ తోనే సినిమాపై అంచనాలు పెంచుకున్న ఈసినిమా యొక్క రైట్స్ సొంతం చేసుకునేందుకు ఓ ప్రముఖ సంస్థ ముందుకొచ్చినట్టు టాక్.
మొత్తంగా ఆ సంస్థ రూ.20 కోట్లకు ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. డీల్ ఓకే అయితే ముందుగా 10 కోట్లు రిలీజ్ కి ముందు మరో 10 కోట్లు ఇస్తాం అని ఆ సంస్థ చెప్పిందంట. పరిస్థితి గమనించిన ఛార్మి.. టీజర్, ట్రైలర్ విడుదలైతే ఇస్మార్ట్ రేటు పెరుగుతుందని ఆలోచన చేసిందట.
దాంతో అలా ఆ ఆఫర్ మిస్ అయినట్టు తెలుస్తుంది. మరోసారి ‘ఇస్మార్ట్’ని ఎవరు సొంతం చేసుకుంటారో? ముందుగా ఈ సినిమా మేలో రిలీజ్ చేద్దాం అని ప్లాన్ చేసుకున్నారు. అయితే హీరోయిన్ నిధి అగర్వాల్ పాస్‌పోర్ట్ పోవడంతో షూటింగ్ డిలే అయ్యింది. సో షూటింగ్ వాయిదా పడింది. త్వరలోనే థియేట్రికల్ ట్రైలర్ తో పాటు మూవీ రిలీజ్ ప్రకటించనున్నారు మేకర్స్.