సూపర్ స్టార్ మహేష్ 25 ఫిలిం మహర్షి బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుంది. సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా మహేష్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ ను రాబడుతుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా భారీ వసూలు సొంతం చేసుకుంది. తెలుగు స్టేట్స్ అయితే ఈ మూవీ చాలా చోట్ల నాన్ బాహుబలి రికార్డును కూడా బ్రేక్ చేసింది.
ఈ నేపథ్యంలో మహర్షి నైజాం కలెక్షన్స్ శుక్రవారం కంటే శనివారం ఎక్కువగా ఉండటం విశేషం. నైజాంలో శనివారం నాడు మహర్షి టిక్కెట్ కౌంటర్లలో డిస్ట్రిబ్యూటర్ షేర్ 3.47 కోట్లుగా ఉంది. మూడో రోజున కూడా ఒక తెలుగు సినిమాకి ఈ రేంజ్ కలెక్షన్స్ బాహుబలి 2 మాత్రమే వచ్చాయి అని ఇప్పుడు మహర్షి ఆ రికార్డును బ్రేక్ చేసిందని ట్రేడ్ చెబుతుంది.
నైజాంలో మహర్షి మొత్తం 3 రోజుల షేర్ 13.14 కోట్లుగా ఉంది. మహేష్ మహర్షితో నైజాం మార్కెట్ లో తన రేంజ్ ని మరోసారి గుర్తు చేసాడు. మహేష్ గతంలో చేసిన సూపర్ హిట్ చిత్రాలు నైజాంలో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించాయి. మరి మహర్షి ఇంకెన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో వెయిట్ అండ్ సి.