అక్కినేని నాగార్జున నుంచి సోలో సినిమా వచ్చి చాలా కాలం అవుతుంది. ప్రస్తుతం నాగ్ రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ లో ‘మన్మథుడు-2’ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా దసరాకో లేదా క్రిస్మస్‌కో రిలీజ్ చేస్తారులే అనుకున్నారు ఫ్యాన్స్. అయితే తాజా సమాచారం ప్రకారం మరో రెండు నెలల్లో ఈసినిమాను రిలీజ్ చేయాలని నాగ్ భావిస్తున్నట్టు టాక్.
నిజానికి నాగ్ ‘మన్మథుడు-2’ను ఆగస్టులో రిలీజ్ చేయాలని ప్లాన్ చేసాడు. కానీ అదే నెలలో ప్రభాస్ ‘సాహో’ ఉండడంతో ఎందుకు వచ్చిందిలే తల నొప్పి అని ఆగస్టులో ‘మన్మథుడు-2’ను వదలడం మంచిది కాదన్న అభిప్రాయానికి వచ్చారట. పోనీ దసరాకు రిలీజ్ చేద్దాం అంటే ‘సైరా’ తో పాటు అల్లు అర్జున్ - త్రివిక్రమ్ మూవీ ఉండనుంది.
అందుకే పోటీ తక్కువ ఉన్న జులై నెలలోనే ‘మన్మథుడు-2’ను ప్రేక్షకుల ముందుకు తేవాలని నాగ్ భావిస్తున్నాడట. అంటే రెండు నెలల్లో ఈసినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోతుందా? ఏమో నాగ్ ఆలోచన చూస్తుంటే అంతే అనిపిస్తుంది. మరి ఇంత త్వరగా కంప్లీట్ చేస్తే క్వాలిటీ విషయంలో ఏమన్నా తేడా కొడితే? ఇటువంటి ప్రశ్నలు ఫ్యాన్స్ ని కంగారు పెడుతున్నాయి. ఇక ఈ సినిమాకు రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ చేస్తున్నాడు. తన మొదటి ‘చిలసౌ’ను నెల రోజుల్లోనే పూర్తిచేయడం విశేషం. నాగ్ కి జోడిగా రకుల్ నటిస్తుంది.