Advertisementt

‘పండుగాడి ఫోటో స్టూడియో’ రెడీ అవుతోంది

Wed 15th May 2019 12:21 PM
ali,pandugadi photo studio,shooting,completed,updates  ‘పండుగాడి ఫోటో స్టూడియో’ రెడీ అవుతోంది
Pandugadi Photo Studio Shooting Update ‘పండుగాడి ఫోటో స్టూడియో’ రెడీ అవుతోంది
Advertisement
Ads by CJ

ఆలీ హీరోగా పెదరావురు ఫిలిం సిటీ పతాకంపై గుదిబండి వెంకట సాంబిరెడ్డి నిర్మించిన జంధ్యాల మార్క్ కామెడీ సినిమా ‘పండుగాడి ఫోటో స్టూడియో’. ప్రస్తుతం ఈ చిత్రం  షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు దిలీప్ రాజా మాట్లాడుతూ స్టార్ డైరెక్టర్ సుకుమార్ గారు ఒకే చేసిన కధ ఇది. ‘‘వీడు ఫోటో తీస్తే పెళ్లయి పోద్ది’’ అనేది  ఈ చిత్ర క్యాప్షన్. ఈ చిత్రంలో హీరోకు 40 ఇయర్స్ వచ్చేవరకు పెళ్లికాదనే నాగదేవత శాపం ఉంటుంది. ఆ క్రమంలో హరోయిన్ కంచు కనకరత్నం పరిచయం జరగడం, ఆమెతో ప్రేమలో పడటం మరోపక్క శాపం వల్ల జరిగే పరిణామాలే ఈ చిత్ర కదాంశం. పూర్తి హాస్య భరిత చిత్రమిది.

1150 చిత్రాల్లో  నటించిన ఆలీ గారు ఈ చిత్రంలో హీరోగా అద్భుతమైన నటనని ప్రదర్శించారు. హీరోయిన్ గా రిషితను పరిచయం చేస్తున్నాము. కుటుంబ సభ్యులతో కడుపుబ్బా నవ్వుకునేలా పండుగ ఫోటో స్టూడియో సినిమా రూపొందించామన్నారు. ఈ సినిమాలో వినోద్ కుమార్, బాబు మోహన్, సుధ, జీవ, శ్రీలక్ష్మి రామ్ జగన్ లాంటి సీనియర్ నటులతో పాటు విలక్షణమైన పాత్రల్లో సందీప్ రాజా,  టీనా చౌదరి తొలి పరిచయం చేస్తున్నాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. జూన్ నెలలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం. అని అన్నారు.       

ఈ చిత్రానికి నిర్మాత: గుదిబండి వెంకట సాంబిరెడ్డి,  సంగీతం: యాజమాన్య, ఎడిటర్: నందమూరి హరి, కెమెరా: మురళీమోహన్ రెడ్డి, ఫైట్స్: షావాలిన్ మల్లేష్,  డాన్స్: రఘు మాష్టర్, అజేయ శివశంకర్, అమ్మ  సుదీర్, దర్శకత్వం: దిలీప్ రాజా

Pandugadi Photo Studio Shooting Update:

Pandugadi Photo Studio Shooting completed

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ