Advertisementt

రాహుల్ నటన అంటే మహేష్‌కు భయమా?

Fri 17th May 2019 06:48 PM
director prasanth,mithai movie,fires,rahul ramakrishna  రాహుల్ నటన అంటే మహేష్‌కు భయమా?
Mithai Director Sensational Comments on Comedian Rahul Ramakrishna రాహుల్ నటన అంటే మహేష్‌కు భయమా?
Advertisement
Ads by CJ

అర్జున్ రెడ్డి సినిమాతో కమెడియన్ గా పరిచయం అయిన రాహుల్ రామకృష్ణ తన మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకుని ఆ తరువాత పెద్ద పెద్ద సినిమాల్లో ఛాన్స్ కొట్టేశాడు. ఆ మధ్య మహేష్ ‘భరత్ అనే నేను’, ‘గీతగోవిందం’ వంటి చిత్రాల్లో మంచి పాత్రలు చేసి మంచి పేరు తెచ్చుకున్న రాహుల్ రామకృష్ణ లేటెస్ట్ గా ‘మిఠాయి’ అనే సినిమాలో ముఖ్యపాత్ర పోషించాడు. కానీ సినిమా ఫెయిల్ అయింది అది వేరే విషయం కానీ ఈ సినిమాను దర్శకత్వం చేసిన దర్శకుడు ప్రశాంత్... రాహుల్ రామకృష్ణ గురించి సంచలనాత్మకంగా మాట్లాడాడు.

ప్రశాంత్ అనే ఆ దర్శకుడు రాహుల్ గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు అందరినీ షాక్ కి గురి చేస్తోంది. ఫేస్ బుక్ వేదికగా అతను రాహుల్ రామకృష్ణ ప్రవర్తనపై పెద్ద పోస్ట్ పెట్టాడు. రాహుల్ రామకృష్ణ అందరూ అనుకుంటున్నట్టు మంచివాడు అయితే కాదు. అతను పచ్చి అబద్దాల కోరు అని, ఎప్పుడూ పక్క వాళ్ళ గురించి చెడుగా మాట్లాడుతూనే ఉంటాడని ఆరోపించాడు. 

భరత్ అనే నేను సినిమాలో మంచి పాత్ర చేసిన రాహుల్ గురించి మరొక విషయం కూడా చెప్పాడు. సినిమాలో తన పాత్ర మహేష్ బాబు పాత్రను డామినేట్ చేస్తుండటంతో కావాలని మహేష్ బాబు తన పాత్రను తగ్గించాడని, సూపర్ స్టార్‌ కి రాహుల్ నటన అంటే భయం అని నమ్మించడానికి ప్రయత్నించాడని ఆ దర్శకుడు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ దర్శకుడు చేసిన ఈ కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి. అయితే రాహుల్ మాత్రం ఇంతవరకు రియాక్ట్ కాలేదు. మరి ఎప్పుడు రియాక్ట్ అవుతాడో కూడా తెలియదు.

Mithai Director Sensational Comments on Comedian Rahul Ramakrishna:

Mithai Director Prasanth fires on Rahul Ramakrishna

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ