Advertisementt

అబ్బో.. కియారా కుమ్మేసిందిగా..!

Sun 19th May 2019 08:02 PM
kiara adwani,peacock magazine,cover page,heroine,kiara advani  అబ్బో.. కియారా కుమ్మేసిందిగా..!
Kiara Adwani in Peacock Magazine Cover page అబ్బో.. కియారా కుమ్మేసిందిగా..!
Advertisement
Ads by CJ

బాలీవుడ్ నుండి టాలీవుడ్‌కి దూసుకొచ్చిన గ్లామర్ కెరటం కియారా అద్వానీ. తెలుగులో మహేష్, రామ్ చరణ్‌లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. మహేష్ ‘భరత్ అనే నేను’లో మిడిల్ క్లాస్ అమ్మాయిగా ఆకట్టుకున్న కియారా అద్వానీ.. ‘వినయ విధేయ రామ’లోను గ్లామర్ గా ఆకట్టుకుంది. కానీ వినయ విధేయ రామ డిజాస్టర్ అవడంతో కియారాకి తెలుగులో ఛాన్స్‌లు సన్నగిల్లాయి. కానీ అమ్మడు బాలీవుడ్ లో ఇప్పుడు టాప్ పొజిషన్‌కి రావడానికి ట్రై చేస్తుంది. తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయిన అర్జున్ రెడ్డి బాలీవుడ్ రీమేక్ కబీర్ సింగ్‌లో షాహిద్ కపూర్‌కి జోడిగా డి గ్లామరస్‌గా సెక్సీగా కనిపించబోతుంది. బోల్డ్‌గా లిప్ లాక్స్‌లో రెచ్చిపోయి నటిస్తున్న కియారాకు కబీర్ సింగ్ బ్రేకివ్వడం ఖాయంగా కనబడుతుంది.

ఇక కియారా ఎప్పటికప్పుడు తన అందాలను సోషల్ మీడియా ద్వారా ఫోటో షూట్స్ రూపంలో చూపిస్తూనే ఉంది. బాలీవుడ్లో నాలుగైదు సినిమాల్తో బిజీగా వున్న కియారా అద్వానీ ప్రస్తుతం కబీర్ సింగ్ ప్రమోషన్స్‌లో పాల్గొంటుంది. ఇక తాజాగా అమ్మడు ఒక మ్యాగజైన్ కోసం చేసిన హాట్ ఫోటో షూట్ ని చూస్తే కియారా లో ఇంతందం దాగుందా అని అనిపించక మానదు. పీకాక్ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం కియరా చేసిన హాటెస్ట్ ఫోటో షూట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

ఆ పీకాక్ మ్యాగజైన్ కవర్ పేజీపై కియరా ఇచ్చిన హాటెస్ట్ ఫోజుకి కుర్రకారుకి గుండె లయ తప్పడం ఖాయం. గ్లామర్ డ్రెస్‌లో కిక్కేంచే ఫోజులో... క్లివేజ్ షో తో కియారా చూసిన చూపుకి యూత్ మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతారు. మరి కియారా కైపెక్కించే ఆ ఫోటో షూట్‌తో బాలీవుడ్ మాత్రమే కాదు... సౌత్ ఇండస్ట్రీ కూడా ఫిదా అవుతుంది. మరి ఇప్పటికే బాలీవుడ్ లో బోలెడన్ని సినిమాలు చేస్తున్న కియారా ఇలాంటి ఫొటో షూట్స్‌తో రెచ్చిపోతే.. సౌత్ మూవీస్ లోను బిజీ కావడం ఖాయమే.

Kiara Adwani in Peacock Magazine Cover page:

Kiara Adwani Hot photoshoot for Peacock 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ