పెళ్లికి ముందు పక్కన పెడితే పెళ్లి తరువాత మాత్రం మంచి మంచి చిత్రాలు చేస్తూ తనలో ఉన్న నటనా చాతుర్యానికి అద్దం పట్టేలా మంచి మంచి ప్రాజెక్టులను ఎంచుకుంటుంది అక్కినేని సమంత. వరస విజయాలతో దూసుకుపోతున్న సామ్ లేటెస్ట్ గా ఓ కొరియన్ చిత్రం రీమేక్ లో నటిస్తుంది. తెలుగులో “ఓ బేబీ” అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమాను నందిని రెడ్డి దర్శకత్వం చేస్తున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలో సామ్ ఒక వయసు మళ్ళిన లేడీ పాత్రలో కనిపించనున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ గురించి సినీ వర్గాలలో కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా కొంత భాగం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. అయితే ఆ తాలూకు ఫుటేజ్ ఊహించిన స్థాయిలో రాకపోవడంతో మళ్ళీ రీషూట్ చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం.
మరి ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియదు కానీ ప్రస్తుతం తెలుగు మీడియాలో వైరల్ అవుతుంది. అయితే దీనిపై సామ్ కానీ, నందిని రెడ్డి కానీ స్పదించలేదు. ఇక ఈ మూవీని సురేష్ బాబు నిర్మిస్తున్నారు. రిలీజ్ డేట్ త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు.