Advertisementt

‘ఫ‌ల‌క్‌నుమా దాస్‌’ విడుదలకు అన్నీ సిద్ధం

Mon 20th May 2019 08:40 PM
falaknuma das,ready to release,vishwak sen,d suresh babu  ‘ఫ‌ల‌క్‌నుమా దాస్‌’ విడుదలకు అన్నీ సిద్ధం
Falaknuma Das Ready to Release ‘ఫ‌ల‌క్‌నుమా దాస్‌’ విడుదలకు అన్నీ సిద్ధం
Advertisement
Ads by CJ

విశ్వ‌క్ సేన్ హీరోగా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం ‘ఫ‌ల‌క్‌నుమా దాస్‌’. వాజ్ఞ్మ‌యి క్రియేష‌న్స్ క‌రాటే రాజు స‌మ‌ర్ప‌ణ‌లో.. విశ్వ‌క్ సేన్ సినిమాస్‌, టెర్ర‌నోవా పిక్చ‌ర్స్ బ్యాన‌ర్స్‌పై ఈ చిత్రాన్ని కరాటే రాజు, చ‌ర్ల‌ప‌ల్లి సందీప్‌ నిర్మించారు. మ‌నోజ్‌కుమార్ కో ప్రొడ్యూస‌ర్‌. సెన్సార్ స‌హా అన్ని కార్య‌క్ర‌మాల్ని పూర్తి చేసి ఈ సినిమాను మే 31న విడుద‌ల చేసేందుకు సిద్ధం చేస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా హీరో, ద‌ర్శ‌కుడు విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. ‘‘సినిమాను ఇటీవల 100 మంది వరకు చూశారు. చూసిన వాళ్లంతా సినిమా బాగుందని ప్రశంసలు కురిపించారు. తప్పకుండా అందరికీ నచ్చుతుంది. మే 31న సినిమాను రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు.

నిర్మాత క‌రాటే రాజు మాట్లాడుతూ.. ‘‘హైదరాబాద్ కల్చర్‌ని ప్రతిభింబిస్తుంది. అందరకీ నచ్చేలా సినిమా ఉంటుంది..’’ అన్నారు.

తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. ‘‘నేను ఇందులో నటించా. మొదట్లో విశ్వక్ మీద నమ్మకం లేకుండెను. కానీ ఓ షార్ట్ ఫిల్మ్ చూపించారు. అప్పుడు విశ్వక్ మీద నమ్మకం కలిగింది. ఇది మలయాళం సినిమా‌కి రీమేక్’’ అన్నారు.

డి.సురేష్ బాబు మాట్లాడుతూ.. ‘‘మే 31న సినిమా రిలీజ్ అవుతుంది. ఈ తరహా సినిమా తెలుగు సినిమాకి కొత్త. విశ్వక్ తాను నటిస్తూ.. దర్శకత్వం చేశారు. తరుణ్ భాస్కర్ బాగా నటించారు. విశ్వక్ ఎంతో ఇష్టంతో సినిమా చేశారు. ఇందులో సంభాషణలు చాలా రియల్ స్టిక్‌గా ఉన్నాయి. దీన్ని ఓ ఆర్ట్ ఫిల్మ్‌లా కాకుండా.. కమర్షియల్ చిత్రంగా బాగా తీశారు. సంగీతం బాగుంది’’ అన్నారు.

హీరోయిన్ స‌లోని మిశ్రా మాట్లాడుతూ.. ‘‘ఇందులో రా కంటెంట్ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. చూసి ఎంజాయ్ చేయండి. విశ్వక్ న‌టిస్తూ చ‌క్క‌గా డైరెక్ట్ చేశారు’ అన్నారు.

Falaknuma Das Ready to Release:

Falaknuma Das Release press Meet

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ