Advertisementt

‘సామీ స్క్వేర్’లో చేసినందుకు బాధపడుతోందట!

Tue 21st May 2019 02:16 PM
saamy square,aishwarya rajesh,heroine,sensational comments,feeling  ‘సామీ స్క్వేర్’లో చేసినందుకు బాధపడుతోందట!
Heroine Sensational Comments on Saamy Square ‘సామీ స్క్వేర్’లో చేసినందుకు బాధపడుతోందట!
Advertisement
Ads by CJ

మన తెలుగు అమ్మాయలు కోలీవుడ్‌లో మంచి హీరోయిన్స్‌గా ఎదగడం మనం చూస్తూనే ఉంటాం. అంజలి, శ్రీదివ్య మన తెలుగు అమ్మాయిలే కానీ వారికి అక్కడ అవకాశాలు ఎక్కువ రావడంతో అక్కడే సెటిల్ అయిపోయారు. అలానే మరో తెలుగు అమ్మాయి అక్కడ దుమ్ము రేపుతోంది. ఆమె ఐశ్వర్య రాజేశ్.

కోలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ లిస్ట్ ఉన్న ఈ తెలుగు బ్యూటీ ఎవరో కాదు...ఒకప్పుడు తెలుగులో ‘మల్లెమొగ్గలు’తో హీరోగా పరిచయమైన రాజేశ్ కూతురు. ప్రస్తుతం ఈమె క్రాంతి మాధవ్ డైరెక్షన్‌లో విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. రీసెంట్‌గా ఈమూవీ సెట్స్ మీదకు వెళ్ళింది. ఇక ఆమె నటించిన ‘కౌసల్య కృష్ణమూర్తి.. ది క్రికెటర్’ చిత్రం తెలుగులో జూన్‌లో విడుదల కాబోతోంది.

తాజా ఇంటర్వ్యూలో ఐశ్వర్య రాజేశ్ మాట్లాడుతూ.. ఇంతకుముందు అంతగా ప్రాధాన్యత లేని పాత్రలను కొన్ని మొహమాటాల కారణంగా చేయవలసి వచ్చింది. అటువంటి పాత్ర చేయడం వల్ల నాకు ఎటువంటి గుర్తింపు రాలేదు. ఉదాహరణకు రీసెంట్‌గా చేసిన ‘సామీ స్క్వేర్’. ఈ మూవీలో రెండో హీరోయిన్‌గా ఏ మాత్రం ప్రాధాన్యత లేని పాత్ర చేసినందుకు ఇప్పటికీ బాధపడుతుంటాను. ఇకపై అటువంటి పొరపాట్లు చేయను. నా పాత్రకు గుర్తింపు ఉండే పాత్రలు మాత్రమే చేస్తాను.. అని చెప్పింది.

Heroine Sensational Comments on Saamy Square:

Aishwarya Rajesh Takes Sensational Decision after Saamy Square

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ