Advertisementt

‘దేవినేని’ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి

Wed 29th May 2019 03:06 PM
devineni,devineni movie,devineni shooting update,tarakratna  ‘దేవినేని’ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి
Devineni First Schedule Completed ‘దేవినేని’ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి
Advertisement
Ads by CJ

ప్రముఖ రాజకీయ నాయకుడు దేవినేని నెహ్రు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం  ‘దేవినేని’. ‘బెజవాడ సింహం’ అన్నది ఉపశీర్షిక. 

నందమూరి తారకరత్న టైటిల్ రోల్ లో నటిస్తుండగా నర్రా శివ నాగేశ్వరరావు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఆర్.టి.ఆర్ ఫిలింస్ పతాకంపై రాము రాథోడ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.. బెజవాడలో ఇద్దరు మహనాయకుల మధ్య స్నేహం, వైరంతో పాటు కుటుంబ నేపథ్యంలో సెంటిమెంట్ ను జోడిస్తూ నడిచే ఈ సినిమాలో బెజవాడలోని మరో సీనియర్ ప్రజా నాయకుడు వంగవీటి రాధ పాత్రలో నటుడు బెనర్జీ నటిస్తుండగా, చలసాని వెంకటరత్నం పాత్రలో తుమ్మల ప్రసన్న కుమార్ నటిస్తున్నారు.. షూటింగ్ శరవేగంగా నటిస్తున్న ఈ సినిమా తాజాగా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. 

ఈ సందర్భంగా దర్శకుడు నర్రా శివ నాగేశ్వర రావ్ మాట్లాడుతూ వంగవీటి రంగా పాత్రలో ప్రముఖ వ్యక్తి నటించనున్నారు.  వంగవీటి రాధ పాత్రతో బెనర్జీ  ఈ చిత్రంలో చేసిన అందరు నటీనటులు చాలా బాగా నటించారు. ముఖ్యంగా చలసాని వెంకటరత్నం పాత్రలో తుమ్మల ప్రసన్న కుమార్ అద్భుతమైన నటన కనపరిచారు. వెంకటరత్నం మళ్లీ పుట్టారా అనిపించేలా ఆయన నటన కొనసాగింది. నందమూరి తారక రత్న నిజమైన దేవినేని నెహ్రూలో పరకాయ ప్రవేశం చేసినట్లు నటించడం మరో విశేషం అన్నారు. 

నిర్మాత రాము రాథోడ్ మాట్లాడుతూ. 1977 దేవినేని నెహ్రూ స్టూడెంట్ లైఫ్ లో జై ఆంధ్ర యా స్టేషన్ నుంచి ప్రారంభమైన ఈ చిత్రంలో ఆనాటి వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ ఆంధ్రప్రదేశ్ లో పలుచోట్ల షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తయ్యింది. అందరూ నటీనటులు చాలా బాగా నటించారు. అన్నారు.

నటీనటులు : నందమూరి తారక రత్న, బెనర్జీ, తుమ్మల ప్రసన్న కుమార్, నాగినీడు, పృధ్వి, అజయ్, M.N.R చౌదరి, అన్నపూర్ణమ్మ, శివారెడ్డి, తేజ రాథోడ్ తదితరులు.

సాంకేతిక నిపుణులు : 

దర్శకత్వం : నర్రా శివనాగేశ్వరరావు

నిర్మాత : రామ్ రాథోడ్

బ్యానర్ :  ఆర్.టి.ఆర్ ఫిలింస్

Devineni First Schedule Completed :

Devineni Movie Latest Update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ