Advertisementt

ప్రియా ప్రకాష్ వారియర్‌కి పెద్ద ఝలక్!

Fri 31st May 2019 01:36 PM
priya prakash varrier,worried,noorin shereef,chance,tollywood,movie  ప్రియా ప్రకాష్ వారియర్‌కి పెద్ద ఝలక్!
Priya Prakash Varrier in Shock ప్రియా ప్రకాష్ వారియర్‌కి పెద్ద ఝలక్!
Advertisement
Ads by CJ

ఒరు ఆధార్ లవ్ అనే చిత్రంలో చిన్న వీడియోతో దేశం మొత్తం  పాపులర్ అయిన ప్రియా ప్రకాష్ వారియర్ కు ప్రస్తుతం ఏ భాషలో అవకాశాలు లేక ఖాళీగా ఉంది. ఒరు ఆధార్ లవ్ అనే చిత్రంతో హీరోయిన్ గా సినిమా రంగ ప్రవేశం చేసిన ఈమెకి మొదటి సినిమా కలిసి రాలేదు. రిలీజ్ అయిన అన్ని భాషల్లో ఈమూవీ డిజాస్టర్ కావడంతో ప్రియకు అవకాశాలు రావడం లేదు.

అయితే సినిమా రిలీజ్ అయ్యాక అందరూ ప్రియా వారియర్ ని వివాదంలోకి లాగారు. ముఖ్యంగా ఆ మూవీ యొక్క డైరెక్టర్. ఆమెపై చాలా కామెంట్స్ చేసారు. ఇక ఈ మూవీలో ప్రియాతో పాటు నోరిన్ షెరీఫ్ అనే మరో అమ్మాయి కూడా నటించింది. ఈమెకు కూడా ప్రియకి వచ్చిన క్రేజ్ రాలేదు కానీ కొంత వచ్చింది. ఈ క్రేజ్ ని క్యాష్ చేసుకుంటూ నోరిన్ తెలుగులో ఛాన్స్ కొట్టేసింది.

తనకంటే తక్కువ పాపులారిటీ తెచ్చుకున్న నోరిన్ షెరీఫ్ కు ఆఫర్ రావడంతో ప్రియా పెద్ద షాక్ లో ఉందట. మూవీ రిలీజ్ అయ్యాక తనకి అవకాశాలు వస్తాయి అనుకుంటే తనకంటే చిన్న పాత్ర వేసిన నోరిన్ ని ఒక తెలుగు ప్రముఖ నిర్మాణ సంస్థ అప్రోచ్ అవడం ఇప్పుడు ప్రియాకి మింగుడు పడడం లేదు అని టాక్. అసలు ఈమెను తీసుకున్న ఆ తెలుగు దర్శకుడు ఎవరో త్వరలోనే తెలియనుంది.

Priya Prakash Varrier in Shock:

Noorin Shereef Gets Chance in Tollywood, Priya Worried

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ