Advertisementt

వంశీతో మరో మూవీకి రెడీ అవుతున్నాం: దిల్ రాజు

Sat 01st Jun 2019 12:12 AM
dil raju,collections,maharshi,dil raju and vamsi paidipally  వంశీతో మరో మూవీకి రెడీ అవుతున్నాం: దిల్ రాజు
Dil Raju About Maharshi Collections వంశీతో మరో మూవీకి రెడీ అవుతున్నాం: దిల్ రాజు
Advertisement
Ads by CJ

మహర్షి చిత్రం 100 కోట్ల షేర్‌ దాటి సూపర్‌ కలెక్షన్స్‌తో చాలా స్ట్రాంగ్‌గా రన్‌ అవుతోంది - సూపర్‌హిట్‌ చిత్రాల నిర్మాత దిల్‌ రాజు 

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో.. వైజయంతి మూవీస్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, పి.వి.పి సినిమా అందించిన ‘మహర్షి’. ఎపిక్‌ బ్లాక్‌ బస్టర్‌గా అఖండ ప్రజాదరణ పొందుతూ.. 100 కోట్ల షేర్‌ క్రాస్‌ చేసి ఇప్పటికీ సూపర్‌ కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. 

ఈ సందర్భంగా సూపర్‌హిట్‌ చిత్రాల నిర్మాత దిల్‌ రాజు మాట్లాడుతూ.. ‘‘మహర్షి చిత్రం మూడోవారం పూర్తి చేసుకొని సక్సెస్‌ఫుల్‌గా నాలుగోవారంలోకి ఎంటర్‌ అయ్యింది. ఇప్పటికే 100 కోట్ల షేర్‌ దాటి సూపర్‌ కలెక్షన్స్‌తో చాలా స్ట్రాంగ్‌గా రన్‌ అవుతోంది. నేను ఫస్ట్‌టైమ్‌ ఇంకో రెండు పెద్ద ప్రొడక్షన్‌ హౌస్‌‌లతో కలిసి పని చేయడానికి కారణం వంశీ కథ చెప్పినప్పుడు ఆ కథ ఇచ్చిన ఎగ్జయిట్‌మెంట్‌. అదే నమ్మకంతో ఈ సినిమా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను. ఒక సినిమా విషయంలో రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు ఆ సినిమా విజయవంతమైతే వచ్చే కిక్కే వేరు. అదే ‘మహర్షి’ ప్రూవ్‌ చేసింది. కొన్ని సినిమాలు డబ్బుతో పాటు మంచి పేరుని కూడా తెస్తాయి. అలాంటి చిత్రం ‘మహర్షి’. ఎక్కడికెళ్ళినా మంచి ఎప్రిషియేషన్‌ వస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రైతులతో కలిసినప్పుడు ఈ సినిమా తర్వాత రైతుల గురించి, వ్యవసాయం గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకునేలా చేశారని వారు చెప్పడంతో వచ్చిన శాటిస్‌ఫ్యాక్షన్‌.. ఎంత డబ్బు వచ్చినా రాదు. మా బ్రదర్‌ మాట్లాడుతూ ఈ బేనర్‌లో ది బెస్ట్‌ మూవీ ఇదే వంశీ అన్నారు. మహేష్‌ కెరీర్‌లో హయ్యస్ట్‌ షేర్‌ సాధించిన సినిమాగా ‘మహర్షి’ నిలిచింది. అలాగే నైజాంలో కూడా ఇంకో రెండు, మూడు రోజుల్లో 30 కోట్ల షేర్‌ను టచ్‌ చేయబోతున్నాం. ఈ సంవత్సరం సంక్రాంతికి ‘ఎఫ్‌2’తో పెద్ద హిట్‌ కొట్టాం. ఇప్పుడు సమ్మర్‌లో ‘మహర్షి’తో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ సాధించాం. ఈ రెండు సక్సెస్‌లు ఇచ్చిన కిక్‌తో ఇంకో మూడు ప్రొడక్షన్స్‌తో రాబోతున్నాం. వంశీతో మా బేనర్‌లో ‘బృందావనం’, ‘ఎవడు’, ‘మహర్షి’లాంటి మూడు సూపర్‌హిట్‌ మూవీస్‌ చేశాం. త్వరలోనే మళ్ళీ వంశీతో మరో సూపర్‌హిట్‌కి రెడీ అవుతున్నాం. సబ్జెక్ట్‌ రెడీ అయ్యింది. కలెక్షన్స్‌తో పాటు అందరి అప్రిషియేషన్‌ కూడా పొందే విధంగా ఆ సినిమా ఉంటుంది’’ అన్నారు. 

Dil Raju About Maharshi Collections:

Dil Raju Press Meet about Maharshi Movie Collections

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ