Advertisementt

లక్కంటే రష్మికాదే.. ఇంక తిరుగులేదు

Sat 01st Jun 2019 12:16 AM
rashmika,sarileru neekevvaru,heroine,mahesh babu,lucky heroine  లక్కంటే రష్మికాదే.. ఇంక తిరుగులేదు
Rashmika Mandanna.. Lucky Girl లక్కంటే రష్మికాదే.. ఇంక తిరుగులేదు
Advertisement
Ads by CJ

ప్రస్తుతం టాలీవుడ్‌లో పూజా హవా మాత్రమే నడుస్తుందననుకున్నారు. కానీ చాపకింద నీరులా రష్మిక మందన్న టాప్ పొజిషన్ లోకొచ్చేసేలా కనబడుతుంది. ఛలో సినిమాతో చిన్నగా ఎంట్రీ ఇచ్చిన రష్మిక.. గీత గోవిందంతో బిగ్గెస్ట్ హిట్ అందుకుని.. టాప్ మోస్ట్ హీరోయిన్స్ కి చెక్ పెట్టింది. ఇక దేవదాస్ ప్లాప్ అయినా.. డియర్ కామ్రేడ్ మీద ఆశలు పెట్టుకున్న రశ్మికకు మొదటిసారిగా బిగ్ స్టార్ హీరో సరసన ఛాన్స్ దక్కింది. నిన్నమొన్నటివరకు రష్మిక మీద నడిచిన గాసిప్ కాస్తా నేడు నిజమై కూర్చుంది.

మహేష్ బాబు సరసన రష్మిక మందన్న నటించబోతుందంటూ ఎప్పటినుండో ప్రచారమైతే జరిగింది కానీ.. ఎక్కడా కన్ఫర్మేషన్ అయితే లేదు. నేడు అది కాస్తా నిజమైంది. నేడు మహేష్ - అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కబోతున్న సరిలేరు నీకెవ్వరూ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో ఉన్న సినిమా కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మొదలైంది. ఈ సినిమాలో రశ్మికనే హీరోయిన్ గా ఫైనల్ చెయ్యడం అమ్మడు.. ఓపెనింగ్ కి విచ్చెయ్యడం చూసి... జనాలంతా నోరెళ్లబెట్టారు. అబ్బా రష్మిక లక్కు గురించి ఎంత చెప్పిన తక్కువే అంటూ చెవులు కొరుక్కుంటున్నారు. ఇక నితిన్ భీష్మ సినిమాలో కూడా రశ్మికనే హీరోయిన్. అయితే మహేష్ సరసన ఛాన్స్ రావడంతోనే రష్మిక తన తొలి తెలుగు హీరో నాగ శౌర్య కి హ్యాండ్ ఇచ్చింది.

Rashmika Mandanna.. Lucky Girl :

Rashmika in Super Star Mahesh Babu Film 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ