Advertisementt

బన్నీ తదుపరి చిత్రం విషయంలో క్లారిటీ వచ్చినట్లే!

Sat 01st Jun 2019 06:34 PM
allu arjun,next film,venu sriram,icon,trivikram srinivas,sukumar  బన్నీ తదుపరి చిత్రం విషయంలో క్లారిటీ వచ్చినట్లే!
Clarity on Allu Arjun Next Film బన్నీ తదుపరి చిత్రం విషయంలో క్లారిటీ వచ్చినట్లే!
Advertisement
Ads by CJ

తన కెరీర్‌లో ఎప్పుడు ఎక్కువగ్యాప్‌ తీసుకోని స్టైలిష్‌స్టార్‌ ‘డిజె’ అందరినీ మెప్పించలేకపోవడం, వక్కంతంవంశీని దర్శకునిగా ‘నా పేరు సూర్య..నా ఇల్లు ఇండియా’ చిత్రం చేస్తే డిజాస్టర్‌ కావడంతో ‘నాపేరు సూర్య..నా ఇల్లుఇండియా’ తర్వాత చాలా గ్యాప్‌ తీసుకున్నాడు. ఇకపై వైవిధ్యభరితమైన చిత్రాలే చేయాలని నిర్ణయించుకుని ఏకంగా మూడు చిత్రాలకు ఓకే చెప్పాడు. ఇందులో ‘జులాయి, సన్నాఫ్‌ సత్యమూర్తి’ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో హ్యాట్రిక్‌ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్‌ వేగంగా జరుగుతోంది. మొదట్లో దసరాకి రావాలని భావించారు. కానీ పోటీలో మెగాస్టార్ ‘సై..రా’ ఉండటంతో వచ్చే సంక్రాంతికి విడుదలకు ప్లాన్‌ చేస్తున్నారు. 

ఇక దీని తర్వాత ఆయన మైత్రిమూవీమేకర్స్‌ సంస్థలో సుకుమార్‌ డైరెక్షన్‌లో చేస్తాడా? లేక దిల్‌రాజు నిర్మాతగా వేణుశ్రీరాం దర్వకత్వంలో ‘ఐకాన్‌’ ముందుగా చేస్తాడా? అనే విషయం ఆసక్తిని రేపుతోంది. చివరకు ఈ విషయంలో ఓ క్లారిటీ వచ్చినట్లే కనిపిస్తోంది. ముందుగా దిల్‌రాజు-వేణుశ్రీరాంల ‘ఐకాన్‌’ ప్రారంభం అవుతుంది. ఈ చిత్రం స్క్రిప్ట్‌ వర్క్‌ దాదాపు పూర్తయిందని, ప్రస్తుతం ప్రీపొడక్షన్‌, ఇతర నటీనటులు, టెక్నీషియన్స్‌ ఎంపిక జరుగుతోందని తెలుస్తోంది. హీరోయిన్‌గా రష్మికా మండన్న గ్యారంటీ అని మాత్రం అంటున్నారు. ఈ చిత్రాన్ని వేగంగా పూర్తిచేసి వచ్చే సమ్మర్‌లో విడుదల చేయాలని అనుకుంటున్నారు. 

ఈ చిత్రం పూర్తయ్యేనాటికి స్క్రిప్ట్‌ విషయంలో టైం తీసుకునే సుకుమార్‌ కూడా బౌండెడ్‌ స్క్రిప్ట్‌తో రెడీగా ఉంటాడు. ఈ చిత్రం ఎర్రచందనం మాఫియా మీద రూపొందుతోంది. ఇక వేణుశ్రీరాం చిత్రానికి ‘ఐకాన్‌’ అనే టైటిల్‌ని ఫిక్స్‌ చేశారు. ‘కనబడుట లేదు’ అనేది ఉపశీర్షిక. దేన్నో వెతుకుతూ, పోలీస్‌లను ముప్పుతిప్పలు పెడుతూ సాగే మైండ్‌గేమ్‌ పరంగా ఈ మూవీ ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే ‘ఐకాన్‌’ టైటిల్‌కి మంచి స్పందన లభిస్తోంది. మొత్తానికి ఇలాంటి పాత్రను అల్లుఅర్జున్‌ ఇప్పటివరకు చేయలేదనే చెప్పాలి. 

Clarity on Allu Arjun Next Film:

Allu Arjun Next film Details

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ