Advertisementt

‘సరిలేరు నీకెవ్వరు’.. రామారావు గారేనా?

Sun 02nd Jun 2019 09:10 PM
sarileru neekevvaru,ramarao garu,anil ravipudi,mahesh babu,balakrishna  ‘సరిలేరు నీకెవ్వరు’.. రామారావు గారేనా?
This is the Real story of Sarileru Neekevvaru ‘సరిలేరు నీకెవ్వరు’.. రామారావు గారేనా?
Advertisement
Ads by CJ

మహేష్ 26వ చిత్రంగా ‘సరిలేరు నీకెవ్వరు’ అనే సినిమా రూపొందుతుంది. ఇందులో మహేష్ ఆర్మీ మేజర్. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ కాబోతోన్న ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికర విషయం ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది. అది ఏంటంటే ఈ మూవీ కథను మహేష్ కంటే ముందు అనిల్ రావిపూడి.. బాలకృష్ణకు చెప్పాడట.

గతంలో అనిల్.. బాలయ్యతో ఓ సినిమా చేస్తున్నాడు అని వార్తలు వచ్చాయి. బాలయ్య 100 వ సినిమా అనిల్ డైరెక్ట్ చేయబోతున్నాడని...దానికి ‘‘రామారావు గారు’’ అనే టైటిల్ కూడా పెట్టారని వార్తలు హల్ చల్ చేసాయి. ఈ మూవీ టైటిల్ తో అనిల్.. బాలయ్య కు కథ చెప్పాడని...ఆ కథ బాలయ్యకు నచ్చినా.. ఎందుకో ఆ సినిమాను పక్కన పెట్టేశాడని అంతా అనుకున్నారు. ఇప్పుడు అనిల్ అదే కథను మహేష్‌కు చెప్పాడని తెలుస్తుంది.

‘‘రామారావు గారు’’ కథలో బాలయ్య ఐఏఎస్ ఆఫీసర్‌ పాత్ర పోషించాల్సి ఉండగా, ఇందులో మాత్రం మహేశ్ ఆర్మీ మేజర్‌గా కనిపించబోతున్నాడని సమాచారం. అంతే కాదు మహేష్ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా చిన్నచిన్న మార్పులు కూడా చేసాడని తెలుస్తుంది. కానీ పాయింట్ మాత్రం అదే అని సమాచారం. దేవిశ్రీ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను అనిల్ సుంకర, దిల్ రాజు, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

This is the Real story of Sarileru Neekevvaru:

Ramarao Garu turns Sarileru Neekevvaru

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ