Advertisementt

బ్రేకింగ్: ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ సినిమా ఇదే!

Wed 05th Jun 2019 08:12 PM
young tiger ntr,jr ntr,rrr,prashanth neel,kgf director jr ntr films  బ్రేకింగ్: ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ సినిమా ఇదే!
NTR, Prashanth Neel Film After RRR బ్రేకింగ్: ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ సినిమా ఇదే!
Advertisement
Ads by CJ

కన్నడలో గత ఏడాది తెరకెక్కిన కెజిఎఫ్ సినిమా పలు భాషల్లో విడుదలై సూపర్ సెన్సేషన్ గా కలెక్షన్స్ కొల్లగొట్టింది. మరి ఒకే ఒక్క కన్నడ సినిమాతో ఆ సినిమాలో నటించిన యష్ ఇండియా వైడ్ గా పేరు సంపాదించాడు. ఆ సినిమా యూత్ కి, మాస్ కి బాగా కనెక్ట్ కావడంతో.. ఓ రేంజ్‌లో సూపర్ హిట్ అయ్యింది. అయితే కెజిఎఫ్ బ్లాక్ బస్టర్ తో ఆ సినిమా దర్శకుడు  ప్రశాంత్ నీల్ యష్ హీరోగా కెజిఎఫ్ పార్ట్ 2 ని కూడా సిద్ధం చేస్తున్నాడు. పలువురు సెలెబ్రిటీ నటీనటులతో, భారీ బడ్జెట్ తో కెజిఎఫ్ 2 సినిమా తెరకెక్కుతుంది. అయితే కెజిఎఫ్ హిట్ అయిన కొత్తల్లో ఆ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెలుగులో దిల్ రాజు నిర్మాతగా ప్రభాస్ హీరోగా ఓ సినిమాని డైరెక్ట్ చేస్తున్నట్లుగా తెగ ప్రచారం జరిగింది. అయితే అదంతా కేవలం రూమర్ అని తేలిపోయింది. 

తాజాగా కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ నెక్స్ట్ అంటూ వార్తలొస్తున్నాయి. ప్రస్తుతానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్.. రాజమౌళి దర్శకత్వంలో RRR సినిమాలో నటిస్తున్నాడు. నిన్నటివరకు గాయాలతో RRR షూటింగ్ కి దూరంగా ఉన్న ఎన్టీఆర్ ఇప్పుడు ఫ్రెష్ గా RRR షెడ్యూల్లో పాల్గొంటున్నాడు. ప్రస్తుతానికి బ్రిటిష్ సైనికులతో ఎన్టీఆర్ పోరాట సన్నివేశాలను రాజమౌళి తెరకెక్కిస్తున్నాడు. అయితే RRR తర్వాత ఎన్టీఆర్ మూవీకి ఇంకా డైరెక్టర్ కన్ఫర్మ్ కాలేదు. 

కానీ తాజాగా కెజిఎఫ్ డైరెక్టర్ తో ఎన్టీఆర్ అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రశాంత్ నీల్ ఓ అద్భుతమైన స్టోరీ లైన్‌తో ఎన్టీఆర్ ని కలిసాడని.. ఆ లైన్ మెచ్చిన ఎన్టీఆర్ RRR తర్వాత సినిమా చేద్దామని చెప్పినట్లుగా వార్తలొస్తున్నాయి.

NTR, Prashanth Neel Film After RRR:

NTR’s Next With KGF Director 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ