మే చివరిలో రాజశేఖర్ - ప్రశాంత్ వర్మల కల్కి గనక బాక్సాఫీసు వద్దకు వస్తే... ఆ సినిమాకి వేసవి సెలవలు బాగా కలిసొస్తాయని అన్నారు. ఇక కల్కి బిజినెస్ ఊపు చూస్తే కల్కి పక్కాగా మే చివరిలో అయినా, జూన్ మొదటి వారంలో అయినా విడుదలయ్యే ఛాన్సెస్ ఉన్నాయనుకున్నారు. ఇక అప్పుడో ఇప్పుడో విడుదవుతుంది అనుకున్న కల్కి సినిమా విషయంలో ఇప్పుడొక ఆసక్తికర న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పీఎస్వీ గరుడవేగ సినిమా తర్వాత రాజశేఖర్ సినిమాలకు మంచి క్రేజ్ వచ్చింది. అలాగే కల్కి సినిమా బిజినెస్ కూడా బాగా జరిగింది.
ఇలాంటి తరుణంలో కల్కి సినిమా ఎప్పుడు విడుదలవుతుందో తెలియదు కానీ.. ఆ సినిమా దర్శకుడు ప్రశాంత్ వర్మ మాత్రం కల్కి సినిమాకి రిపేర్లు చేస్తున్నట్లుగా టాక్ వినబడుతుంది. ప్రశాంత్ వర్మ సినిమా క్వాలిటీ విషయంలో రాజీ పడకపోవడంతో చాలా సన్నివేశాలను రీ షూట్స్ చెయ్యడం వలనే సినిమా విడుదల ఆలస్యమవుతుందని న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరి ఈ రిపేర్ల వలన సినిమా విడుదల ఆలస్యమంటూ ఓ న్యూస్ ఫిలింసర్కిల్స్ లో కూడా చక్కర్లు కొడుతోంది. అయితే ఈ విషయం ఎంతవరకు కరెక్ట్ అనేది మాత్రం స్పష్టత లేదు. అయితే ఇలా రీ షూట్స్ జరగడం వల్లే సినిమా ప్రమోషన్స్ ని కానీ, విడుదల తేదీని కానీ కల్కి మేకర్స్ ప్రకటించలేదంటున్నారు.