Advertisementt

‘ఫలక్‌నుమా దాస్ 2’తో షాకిస్తాడట..!

Sat 08th Jun 2019 10:47 PM
falaknuma das,success meet,viswak sen  ‘ఫలక్‌నుమా దాస్ 2’తో షాకిస్తాడట..!
Falaknuma Das Success Meet Details ‘ఫలక్‌నుమా దాస్ 2’తో షాకిస్తాడట..!
Advertisement
Ads by CJ

వన్మయి క్రియేషన్స్ పతాకంపై కరాటే రాజు సమర్పణలో విశ్వక్ సేన్ సినిమాస్ మరియు టెర్రమర పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన  చిత్రం ‘ఫలక్‌నుమా దాస్’. మాస్ కా దాస్ టాగ్ లైన్‌తో విశ్వక్ సేన్ నటించి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 31న విడుదలై విశేష స్పందనను పొందుతూ భారీ కలెక్షన్స్ రాబడుతోంది. ఈ సందర్భంగా సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేశారు. 

ఈ కార్యక్రమంలో నిర్మాత కరాటే రాజు మాట్లాడుతూ.. ‘‘హైదరాబాద్‌లోని 118 లొకేషన్స్‌లలో తీసిన ఈ సినిమా అందరి మన్ననలు పొందుతూ సక్సెస్ ఫుల్‌గా కొనసాగుతోంది.  దాదాపు రెండు సంవత్సరాలు‌గా స్క్రిప్ట్ వర్క్ చేసి ఎంతో కష్టపడి విశ్వక్ ఈ ప్రాజెక్ట్‌ను చేసాడు. ఆ కష్టం ఇప్పుడు మంచి ప్రతిఫలాన్ని ఇచ్చింది. 7 రోజుల్లో 7కోట్ల 50 లక్షలు వసూలు చేసింది అని చెప్పడానికి సంతోష పడుతున్నాను. ఇంత విజయాన్ని అందించిన ప్రేక్షకులకు నా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. అలానే ఈ చిత్రంలో సెకండ్ ఆఫ్ ల్యాగ్ ఎక్కువైందని అంటున్నారు. అందుకే కొత్తగా ఎడిటింగ్ చేసాము. ఆ ల్యాగ్‌ను తీసేసి సరికొత్తగా ప్రజంట్ చేస్తున్నాము. శనివారం నుంచి ఇది అమలు అవుతుంది. 50 థియేటర్స్‌తో పాటు మల్టిప్లెక్స్‌లు కూడా పెరుగుతున్నాయి. ఇక మా నెక్స్ట్ చిత్రం ఫలక్‌నుమా దాస్ 2 తో భారీ క్యాస్టింగ్‌తో మరోసారి మీ ముందుకు వస్తాము..’’ అన్నారు. 

నటుడు ఉత్తేజ్ మాట్లాడుతూ.. శివ సినిమాలో యాదగిరి, చందమామ సినిమాలో పాత్రల తరువాత అంత మంచి పేరు మళ్లీ ఈ ఫలక్‌నుమా దాస్ లో చేసిన పాత్రకు వచ్చింది. మలయాళంలో వచ్చిన ‘అంగమాలై’ చిత్రాన్ని రీమేక్ చేసాడు. అయితే.. ఎక్కడా రీమేక్ అనే విషయం గుర్తుకు రాదు. జస్ట్ ఆ చిత్రాన్ని ఇన్స్పైర్ గానే తీసుకొని ఎంతో క్లారిటీతో పక్కాగా సినిమాను తెరకెక్కించి నటించాడు విశ్వక్ సేన్. అతను పడిన కష్టం ఫలించి ఇంత పెద్ద రిజల్ట్ ను ఇచ్చింది. టీమ్ అందరికీ కంగ్రాట్స్’’ అన్నారు. 

సినిమా చూసిన మొదటి రోజే పూర్తి సంతృప్తితో ఉన్నాను. అనుకున్న ఫలితం వచ్చినందుకు సంతోషంగా ఉన్నాను అని  కో ప్రొడ్యూసర్ మాణిక్య రావు అన్నారు. 

హీరో మరియు ఈ చిత్ర దర్శకుడు విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. నేను చాలా హ్యాపీ‌గా ఉన్నాను. సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే ఎన్నో అవాంతరాలు వచ్చాయి. ఎన్నో జరిగాయి కానీ ఎవరూ ఏమీ చేయలేకపోయారు. సినిమా అప్పటి నుంచి ఇప్పటిదాకా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇకపై కూడా అవుతూనే ఉంటుంది. నా టీమ్ కోఆపరేషన్, కష్టం లేకపోతే సినిమా సక్సెస్ టాక్ వచ్చేది కాదు. ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రతి ఒక్క ప్రేక్షకుడికి పేరు పేరున ధన్యవాదాలు తెలియచేస్తున్నా.. ఈ ఫలక్ నుమా దాస్ తో ధమ్కీ ఇచ్చా.. నా నెక్స్ట్ సినిమాతో షాక్ ఇస్తా..’’ అని అన్నారు.

హీరోయిన్ ప్రశాంతి, జీవన్, యస్వంత్, సంజయ్, టోనీ, కౌశిక్, కార్తిక్, వివేక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Falaknuma Das Success Meet Details:

Falaknuma Das 2 soon

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ