Advertisementt

స్టార్‌ డైరెక్టర్‌‌ని అవమానించిన సీనియర్‌ కమెడియన్‌

Sat 08th Jun 2019 10:56 PM
shankar,graphics director,real talent,vadivelu,kollywood  స్టార్‌ డైరెక్టర్‌‌ని అవమానించిన సీనియర్‌ కమెడియన్‌
Vadivelu makes sensational comments on director Shankar స్టార్‌ డైరెక్టర్‌‌ని అవమానించిన సీనియర్‌ కమెడియన్‌
Advertisement
Ads by CJ

మణిరత్నం తర్వాత దక్షిణాది దర్శకునిగా తన సత్తాని బాలీవుడ్‌తో సహా దేశవ్యాప్తంగా అన్ని భాషలను మెప్పించిన దర్శకుడు శంకర్‌. ‘జెంటిల్‌మేన్‌, భారతీయుడు, ప్రేమికుడు, ఒకే ఒక్కడు, జీన్స్‌, అపరిచితుడు, శివాజీ, రోబో’ వంటి పలు చిత్రాలు అన్ని భాషల వారిని మెప్పించాయి. రాజమౌళి ‘బాహుబలి’ ముందు వరకు దక్షిణాది అంటే కేవలం శంకర్‌ పేరే వినిపించేది. ఇక ఈయన ఇటీవల ఎక్కువగా గ్రాఫిక్స్‌ని నమ్ముకుని ‘ఐ, 2.0’ చిత్రాలతో నిరాశపరిచిన విషయం తెలిసిందే. 

కాగా విషయానికి వస్తే తమిళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఉన్న గౌరవాన్ని పోగొట్టుకుని సినిమాలకు, అటు రాజకీయాలకు చెడిన ప్రముఖ కమెడియన్‌ వడివేలు. ఈయన నాడు తనని కెరీర్‌ మొదట్లో ప్రోత్సహించిన విజయ్‌కాంత్‌ని పోలీస్‌స్టేషన్‌ వరకు లాగాడు. ఒకానొక సమయంలో రజనీకాంత్‌ సైతం తన కోసం వస్తే ముందుగా వడివేలు డేట్స్‌ తీసుకోమని చెప్పేవాడు. కానీ వడివేలు తమిళ స్టార్స్‌ అందరినీ ఏదో మాట అంటూ రావడంతో హీరోలు వివేక్‌, సంతానం వంటి వారిని ఎంకరేజ్‌ చేశారు. ఇక శంకర్‌ తానే నిర్మాతగా వడివేలుతో ‘హింసించే 23వ రాజు పులకేసి’ చిత్రం నిర్మించాడు. దానికి సీక్వెల్‌ కోసం కోట్లు ఖర్చుపెట్టి సెట్స్‌ వేయిస్తే వడివేలు షూటింగ్‌కి రాకుండా ఇబ్బందులు పెట్టాడు. 

తాజాగా మరోసారి వడివేలు శంకర్‌ని పలు మాటలు అన్నాడు. మొదటి నుంచి శంకర్‌ గ్రాఫిక్స్‌ని నమ్ముకుని బతికేస్తున్నాడు. ఆయనకి గ్రాఫిక్స్‌కి డైరెక్షన్‌ చేయడం వచ్చు గానీ సినిమాని, నటీనటులను డైరెక్ట్‌ చేయడం రాదు.. అని నానా మాటలు అన్నాడు. దీంతో తమిళానికి పేరు తెచ్చిన దర్శకదిగ్గజం వంటి శంకర్‌ని ఇలా చులకన చేయడం తమిళ ఇండస్ట్రీనే కించపరచడం అవుతుందని కొందరు తమిళ సినీ ప్రముఖులు వడివేలుపై మండిపడుతున్నారు. 

Vadivelu makes sensational comments on director Shankar:

Shankar Is a Graphics Director, No Real Talent says Vadivelu

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ