Advertisementt

నాగార్జున మ‌న్మ‌థుడు 2 టీజ‌ర్‌ ఎప్పుడంటే...!!

Thu 13th Jun 2019 03:16 PM
nagarjuna,manmadhudu 2 movie,teaser,june 13  నాగార్జున మ‌న్మ‌థుడు 2 టీజ‌ర్‌ ఎప్పుడంటే...!!
Manmadhudu 2 Teaser Release Date Locked నాగార్జున మ‌న్మ‌థుడు 2 టీజ‌ర్‌ ఎప్పుడంటే...!!
Advertisement
Ads by CJ

కింగ్ నాగార్జున హీరోగా మ‌నం ఎంట‌ర్‌ప్రైజ‌స్‌, ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్‌, వ‌య్‌కామ్ 18 స్టూడియోస్‌ ప‌తాకాల‌పై రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం `మ‌న్మ‌థుడు 2`. నాగార్జున అక్కినేని, పి.కిర‌ణ్ (జెమిని కిర‌ణ్‌) నిర్మాత‌లు. ప్ర‌స్తుతం సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. ఒక షెడ్యూల్ మిన‌హా సినిమా చిత్రీక‌ర‌ణంతా పూర్త‌య్యింది. త్వ‌ర‌లోనే ఈ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌కు కూడా ప్లాన్ చేస్తున్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమాకు సంబంధించిన నాగార్జున స్టైలిష్ లుక్‌తో పాటు నాగార్జున‌- ర‌కుల్‌, నాగార్జున‌- కీర్తిసురేష్ ఫోటోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేశాయి. సినిమాపై ఇప్ప‌టికే మంచి అంచ‌నాలున్నాయి. ఈ అంచ‌నాల‌ను మ‌రింత పెంచేలా జూన్ 13న ఈ సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేస్తున్నారు. 

మ‌న్మ‌థుడు ఇన్‌స్పిరేష‌న్‌తో, రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ ఫ‌న్ రైడ‌ర్ తెర‌కెక్కుతోంది. చైత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి ఎం.సుకుమార్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. 

Manmadhudu 2 Teaser Release Date Locked:

Nagarjuna Manmadhudu 2 teaser on june 13th

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ