Advertisementt

'ఓటర్‌' కి విముక్తి దొరికింది!!

Fri 14th Jun 2019 07:52 PM
voter movie,manchu vishnu,voter release date,21st june   'ఓటర్‌' కి విముక్తి దొరికింది!!
Voter Movie Release Date Locked 'ఓటర్‌' కి విముక్తి దొరికింది!!
Advertisement
Ads by CJ

రామా రీల్స్‌ బ్యానర్‌పై జాన్‌ సుధీర్‌ పూదోట నిర్మాతగా విష్ణు, సురభి జంటగా జి.ఎస్‌.కార్తీక్‌ దర్శకత్వం వహించిన 'ఓటర్‌' చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. అనేక అడ్డంకులు ఎదుర్కొన్న ఈ చిత్రం మీద ఆడియన్స్‌లోనూ, ట్రేడ్‌ వర్గాల్లోనూ మంచి క్రేజ్‌ ఏర్పడింది. అందుకే సార్థక్‌  మూవీస్‌ సంస్థ పోటీపడి మరీ ఫ్యాన్సీ రేటుకి విడుదల హక్కులను సొంతం చేసుకుంది. ఈ నెల 21న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుందీ సినిమా.  నిర్మాత మాట్లాడుతూ 'పదవిలో ఉన్న నాయకుడు సరిగా పనిచేయకపోతే.. అతనితో ఎలా పనులు చేయించుకోవాలో తెలిపే నేపథ్యంలో సాగే సినిమా ఇది. ఓటు  హక్కు, ఓటర్‌ విలువను తెలిపే ఈ చిత్రాన్ని పొలిటికల్‌ డ్రామాగా దర్శకుడు కార్తీక్‌ చక్కగా తెరకెక్కించారు. చక్కని సందేశంతోపాటు, పోరాట సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఎన్నో విజయవంతమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించిన సార్థక్‌ మూవీస్‌ సంస్థ మా సినిమాను విడుదల చేయడం ఆనందంగా ఉంది' అని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్‌, కెమెరా: రాజేష్‌ యాదవ్‌, ఎడిటింగ్‌: కె.ఎల్‌ ప్రవీణ్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ : కిరణ్‌ తనమాల.   

Voter Movie Release Date Locked:

Voter Movie Releasing on 21st June

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ