Advertisementt

`మ‌న్మ‌థుడు 2`కు కూడా డేట్ ఇచ్చేసారు!!

Fri 14th Jun 2019 11:29 PM
nagarjuna,manmadhudu 2,release date,manmadhudu teaser  `మ‌న్మ‌థుడు 2`కు కూడా డేట్ ఇచ్చేసారు!!
Manmadhudu 2 Release Date Locked `మ‌న్మ‌థుడు 2`కు కూడా డేట్ ఇచ్చేసారు!!
Advertisement
Ads by CJ

కింగ్ నాగార్జున‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ జంట‌గా న‌టిస్తున్న చిత్రం `మ‌న్మ‌థుడు 2`. రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌కుడు. మ‌నం ఎంట‌ర్ ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్స్‌, వ‌యకామ్ 18 స్టూడియోస్ ప‌తాకాలపై నాగార్జున అక్కినేని, పి.కిర‌ణ్(జెమిని కిర‌ణ్‌) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆగ‌స్ట్ 9న ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఈ సంద‌ర్భంగా గురువారం ఈ సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. నాగార్జున వ‌ర్జీన్ యువ‌కుడిగా బ‌య‌ట‌కు క‌న‌ప‌డతారు, కానీ మ‌రో ప‌క్క‌ అమ్మాయిల వెంట‌ప‌డే ఉమ‌నైజ‌ర్ పాత్ర‌లో క‌న‌ప‌డుతున్నారు. ఇలాంటి బోల్డ్ రోల్‌లో నాగార్జున న‌టించ‌డం ఇదే తొలిసారి. టీజ‌ర్‌ను చూస్తుంటే సినిమాను లావిష్‌గా తెర‌కెక్కించార‌ని అర్థ‌మ‌వుతుంది. సినిమాటోగ్ర‌ఫీ పెద్ద ఎసెట్‌గా క‌న‌ప‌డుతుంది. 

ఎండిపోయిన చెట్టుకి నీళ్లు పోస్తే మళ్ళీ పూలు పూస్తాయా ??

పిల్లలకు కోచింగ్ ఇవ్వాల్సిన వయసులో నువ్వు బాటింగ్ కు దిగుతున్నావ్!

టీజ‌ర్ చివ‌ర్లో ఐ డోంట్ ల‌వ్ ఆ ఓన్లీ మేక్ ల‌వ్ అనే చివ‌రి డైలాగ్ యూత్ ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా ఉంది. సింగిల్ షెడ్యూల్ మిన‌హా సినిమా చిత్రీక‌ర‌ణంతా పూర్త‌య్యింది. సీనియ‌ర్ న‌టి ల‌క్ష్మి, వెన్నెల కిశోర్, రావు ర‌మేష్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. చైత‌న్ భర‌ద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఎం.సుకుమార్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు

Manmadhudu 2 Release Date Locked :

nagarjuna Manmadhudu 2 Releasing on August 09th

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ