అప్పుడప్పుడు సినిమా అవకాశాలు ఒకేసారి వస్తాయి లేదా అసలు అంటే అసలు రావు. అటువంటి పరిస్థితే సుధీర్ బాబుకి ఎదురైంది. ఒకేసారి సినిమా అవకాశాలు రావడంతో బాలీవుడ్ లో ఓ పెద్ద ప్రాజెక్ట్ ని వదులుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం సుధీర్ బాబు తీరిక లేకుండా వరస సినిమాలు చేస్తున్నాడు. సమ్మోహనం సినిమా తరువాత బాడ్మింటన్ ప్లేయర్ గోపిచంద్ బయోపిక్ లో నటిస్తున్నాడు. దీన్ని ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేస్తున్నాడు. ఇది సుధీర్ బాబు సొంత బ్యానర్ లోనే తెరకెక్కుతుంది. దీనితో పాటు ఇంద్రగంటితో దిల్ రాజు నిర్మాణంలో చాన్స్ వచ్చింది. ఈ మూవీ ఆల్రెడీ స్టార్ట్ అయింది.
అయితే సినిమాలతో బిజీగా ఉన్న టైములో హిందీ సినిమా బ్రహ్మాస్త్రలో అవకాశం వచ్చింది సుధీర్ బాబుకి. కానీ ఏం లాభం? వదిలేసుకోవాల్సి వచ్చింది. డేట్స్ ఖాళీ లేక వదులుకున్నాడు. ఇందులో నాగార్జున కూడా నటిస్తున్నాడు. గతంలో సుధీర్ హిందీలో విలన్ పాత్ర చేయడంతో బ్రహ్మాస్త్రలో అదే షేడ్స్ వున్న పాత్ర ఆఫర్ చేసారు. చేద్దాం అని చాలానే ట్రై చేసాడు కానీ ఇక్కడ సినిమాలు అన్నీ పక్కన పెడితే తప్ప, అక్కడి డేట్ లతో మ్యాచ్ కావడం లేదట. దాంతో చేసేదిలేక, ఓ నమస్కారం పెట్టి ఊరుకున్నాడు. నిజానికి ఏదొక సినిమా పక్కన పెట్టి ఈ బాలీవుడ్ మూవీ చేసుంటే అక్కడ పరిచయాలు ఎక్కువ అయ్యేవి.. మరిన్ని ఆఫర్స్ వచ్చేవి. ఇటువంటివి మళ్లీ మళ్లీ రావు కదా సుధీర్ బాబు.