అందరికి నమస్కారం, నా పేరు ప్రశాంత్ గౌడ్. నేను సార్ధక్ మూవీస్ బ్యానర్‌లో 12 సంవత్సరాలుగా సినిమాలు నిర్మించడం, ఫైనాన్స్ చేయటం మరియు డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఉన్నాము. నేను ఎన్నో సినిమాలు చేసాను, లాభాలు వచ్చినపుడు సంతోషించను.. అలాగే నష్టాలు వచ్చినపుడు బాధ పడను కానీ ఎప్పుడు సినిమా ఇండస్ట్రీ వదిలి వెళ్ళలేదు. నాకు సినిమా వ్యాపారంపై మంచి అవగాహన ఉంది. నేను ఈ రంగంలో రాణించగలను అనే నమ్మకం నాకుంది.
సార్ధక్ మూవీస్ బ్యానర్ పై మంచు విష్ణు నటించిన ఓటర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ హక్కులు మా సార్ధక్ మూవీస్ బ్యానర్ సాంతం చేసుకుంది. రిలీజ్‌కి ఎటువంటి ఆటంకాలు లేవు. ఓటర్ సినిమా జూన్ 21న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది.