Advertisementt

రాజ్ తరుణ్ మరో చిత్రం మొదలైంది..!

Wed 19th Jun 2019 09:25 PM
raj tarun,sri satyasai arts,vijay kumar konda,radha mohan kk,movie opening  రాజ్ తరుణ్ మరో చిత్రం మొదలైంది..!
Raj Tarun, Konda Vijay Kumar Film Launched రాజ్ తరుణ్ మరో చిత్రం మొదలైంది..!
Advertisement
Ads by CJ

రాజ్‌ తరుణ్‌ హీరోగా కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో కె.కె. రాధామోహన్‌ కొత్త చిత్రం ప్రారంభం 

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ కథానాయకుడిగా హిట్‌ చిత్రాల నిర్మాత కె.కె. రాధామోహన్‌ శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై యువ దర్శకుడు కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో నిర్మిస్తున్న ‘ప్రొడక్షన్‌ నెం.8’ పూజా కార్యక్రమాలు సంస్థ కార్యాలయంలో జూన్‌ 19 ఉదయం 8.30 గంటలకు జరిగాయి. 

ఈ సందర్భంగా నిర్మాత కె.కె. రాధామోహన్‌ మాట్లాడుతూ..‘‘ ‘అధినేత’, ‘ఏమైంది ఈవేళ’, ‘బెంగాల్‌ టైగర్‌’, ‘పంతం’ వంటి మంచి హిట్‌ చిత్రాల తర్వాత మా శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ బేనర్‌లో చేస్తున్న మరో మంచి కథా చిత్రం ఇది. రాజ్‌ తరుణ్‌, కొండా విజయ్‌కుమార్‌ కాంబినేషన్‌లో ఇది మా బేనర్‌కి మరో సూపర్‌హిట్‌ సినిమా అవుతుంది’’ అన్నారు. 

దర్శకుడు కొండా విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ.. ‘‘మూడు సంవత్సరాల పాటు వర్క్‌ చేసి రెడీ చేసిన అద్భుతమైన ఈ కథను రాధామోహన్‌గారు విన్న వెంటనే స్టార్ట్‌ చేద్దాం అన్నారు. రాజ్‌ తరుణ్‌కి ఇది చాలా మంచి సినిమా అవుతుంది. ‘గుండెజారి గల్లంతయ్యిందే’ కంటే మంచి కథ ఇది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ రాధామోహన్‌గారి బేనర్‌లో చెయ్యడం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు. 

రాజ్‌ తరుణ్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్‌ నుండి నాన్‌స్టాప్‌గా షూటింగ్‌ జరుపుకుంటుంది. ఈ చిత్రంలో నటించే నటీనటుల ఎంపిక జరుగుతోంది. 

ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఫొటోగ్రఫీ: ఆండ్రూస్‌, మాటలు: నంద్యాల రవి, ఆర్ట్‌: రాజ్‌కుమార్‌, కో-డైరెక్టర్‌: వేణు కూరపాటి, మేకప్‌: శివ, కాస్ట్యూమ్స్‌: నాగులు, స్టిల్స్‌: ఆనంద్‌, పబ్లిసిటీ: ధని ఏలె, నిర్మాత: కె.కె. రాధామోహన్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కొండా విజయ్‌కుమార్‌.

Raj Tarun, Konda Vijay Kumar Film Launched :

Raj Tarun Movie in Sri Satyasai Arts Banner

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ