ఐరా క్రియేషన్స్ పతాకం పై ఉషా మూల్పూరి నిర్మాతగా, శంకర్ ప్రసాద్ మూల్పూరి సమర్పణలో ప్రొడక్షన్ నెం 3 ఇటీవలే వైజాగ్ షెడ్యూల్ లో హీరో నాగశౌర్య ఎక్సిడెంట్ కి గురికావటం తెలిసిన విషయమే. దీనికి సంబంధించి నాగశౌర్య 15 రోజులు బెడ్‌రెస్ట్ లో తన నివాసం నందు వున్నారు. ఈ విషయం తెలుసుకున్న దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు..ఈ రోజు(బుధవారం) నాగశౌర్య నివాసానికి వెళ్లి పరామర్శించారు. కె.రాఘవేంద్రరావుతో పాటు ప్రముఖ దర్శకుడు బి.వి.యస్ రవి కూడా నాగశౌర్యని పరామర్శించారు.
ఈ సందర్బంగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. ‘‘నాగశౌర్య చాలా మంచి కుర్రాడు, స్వశక్తితో తనేంటే ప్రూవ్ చేసుకున్న హీరోల్లో శౌర్య ఒకడు, సినిమా కోసం చాలా కష్టపడతాడు. అలాంటి వాడికి యాక్సిడెంట్ అయింది అనగానే చాలా బాధ అనిపించింది. వెంటనే ఫోన్ లో పరామర్శించాను, కాని మనసు ఒప్పక డైరెక్టుగా తన నివాసానికి వచ్చాను. దేవుని దయవలన త్వరలో కోలుకోవాలని షూటింగ్ లో చురుకుగా పాల్గోనాలని కోరుకుంటున్నాను. నాగశౌర్య ఫ్యామిలీ చాలా మంచి ఫ్యామిలీ, వారందరి ప్రేమ శౌర్య పై వుంటుంది. దేవుడు కృప వాళ్ళందరికి వుంటుందని ఆశిస్తున్నాను..’’ అని అన్నారు.
దర్శకుడు బి.వి.యస్ రవి మాట్లాడుతూ.. ‘‘నాకు శౌర్య అంటే గౌరవం వుంది. ఇప్పడున్న చాలా మంది యంగ్ హీరోల్లొ శౌర్య ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. అలాంటి శౌర్యకి ఇలా జరగటం చాలా బాధగా అనిపించింది. ఈరోజు తన నివాసంలో కలిసాము. ఆయనకి వారి కుటుంబానికి మంచి జరగాలని కోరుకుంటున్నాను.. అని అన్నారు
ప్రస్తుతం నాగశౌర్య తన సొంత బ్యానర్ లో చిత్రాన్ని చేస్తున్నాడు. రమణ తేజ అనే నూతన దర్శకుడ్ని పరిచయం చేస్తున్నాడు.