Advertisementt

బెదిరింపులకు లొంగేది లేదు: ఓటర్ డిస్ట్రిబ్యూటర్

Fri 21st Jun 2019 06:47 PM
voter movie,distributor,serious,warning  బెదిరింపులకు లొంగేది లేదు: ఓటర్ డిస్ట్రిబ్యూటర్
Voter Distributor Serious Warning బెదిరింపులకు లొంగేది లేదు: ఓటర్ డిస్ట్రిబ్యూటర్
Advertisement
Ads by CJ

‘ఓటర్‌’ సినిమా విడుదల విషయంలో కొందరు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. సినిమాని ఆపాలంటూ బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయి. ఎన్ని బెదిరింపులు వచ్చినా సినిమాని ఆపేది లేదు. నేడు(శుక్రవారం) గ్రాండ్‌గా విడుదల‌ చేస్తున్నాం’ అని నిర్మాత ప్రశాంత్‌ గౌడ్‌ అన్నారు. మంచు విష్ణు, సురభి జంటగా జి. కార్తీక్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఓటర్‌’. జాన్‌ సుధీర్‌ పూదోట నిర్మించారు. ఈ చిత్రం ప్రపంచ థియేట్రికల్ హక్కుల‌ను సార్ధక్‌ మూవీస్‌ పతాకంపై ప్రశాంత్‌ గౌడ్‌ దక్కించుకున్నారు. అయితే ఈ సినిమా స్క్రిప్ట్‌ విషయంలో వివాదం తలెత్తిన నేపథ్యంలో చిత్రం రామరీల్స్‌కి చెందిన నిర్మాత జాన్‌ సుధీర్‌ పూదోట, దర్శకుడు కార్తీక్‌పై 24 ఫిల్మ్‌ ఫ్యాక్టరీ సంస్థ‌ కోర్టులో కేసు వేసిన విషయం విదితమే. సినిమాని ఆపాలంటూ వేసిన పిటిషన్‌ని కోర్టు తిరస్కరించింది. ఈ విషయాన్ని అడ్వకేట్ వేణుకుమార్ వెల్ల‌డించారు. 

గురువారం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో వేణుకుమార్ మాట్లాడుతూ, ‘24 ఫిల్మ్‌ ఫ్యాక్టరీ వేసిన పిటిషన్ ని కోర్టు ఫాల్స్‌ సూట్‌గా భావించి తిరస్కరించింది. అలాగే సినిమా విడుదల విషయంలో ఎలాంటి అభ్యంతరం తెల‌పలేదు. మా వాదనని ప్రశంసించింది. కావున ప్రస్తుతం ‘ఓటర్‌’ సినిమా విడుద‌ల చేసుకోవ‌చ్చు అని తెలిపింది. దీనికి సంబంధించి కోర్టు ఆర్డర్‌ కూడా వచ్చింది’ అని అన్నారు. సినిమా హక్కుల‌ను తీసుకున్న ప్రశాంత్‌ గౌడ్‌ మాట్లాడుతూ, ‘నేను గత 12 ఏళ్లుగా చిత్ర రంగంలో ఉన్నాను. డిస్టిబ్యూటర్‌గా, నిర్మాతగా, ఫైనాన్సర్‌గా ఉన్నాను. దాదాపు 42 సినిమాలు నైజాంలో డిస్ట్రిబ్యూట్‌ చేశా.  ఏడు సినిమాలు నిర్మించా. జాతీయ స్థాయిలో ప్రొడ్యూస్ చేశాను. నాపై ఇప్పటి వరకు ఎలాంటి వివాదాలు లేవు. కానీ సినిమా ఆగిపోతుందని మార్కెట్‌లో చాలా రూమర్స్‌ ఉన్నాయి. ఈ సినిమాలోని పాయింట్‌ నచ్చి కొనుక్కున్నా. ఓటర్ విలువ‌ని తెలిపే చిత్రమిది.  రాజ్యంగబద్ధంగా ఎన్నికైన ఓ రాజకీయ నాయకుడు తప్పు చేస్తే మనం ఎలా చర్య‌లు తీసుకోవచ్చో ఇందులో ద‌ర్శ‌కుడు చర్చించారు. ఎల‌క్షన్స్‌ తర్వాత రావాల్సింది. ఈ హక్కులు తీసుకున్నాక. సినిమాపై పలు వివాదాలున్నాయని చెప్పారు. లీగల్‌గా సల‌హాలు తీసుకున్న‌ప్పుడు విడుదల‌ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. ఈ నెల‌ 21న దాదాపు 370థియేటర్లలో విడుదల‌ చేస్తున్నాం. 

అయితే ఈ సినిమాని తీసుకున్న‌ప్పట్నుంచి మార్కెట్‌ నుంచి వివిధ రకాల‌ బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయి. వేధింపుల‌కు గురి చేస్తున్నారు. సినిమాని ఎలా రిలీజ్‌ చేస్తారంటూ బెదిరిస్తున్నారు. ఎన్ని బెదిరింపు కాల్స్‌ వచ్చినా అధైర్య పడకుండా సినిమాని రిలీజ్‌ చేయాల‌ని నిర్ణ‌యించాం. నేను నా కష్టార్జితంతో  కొనుక్కున్న చిత్ర‌మిది. లీగల్‌గా తీసుకున్నా. లీగల్‌గా ముందుకెళ్తున్నా. సినిమాకి సంబంధించి క్రియేటివ్‌ సైడ్‌ వివాదాలుంటే అది నాకుగానీ, నిర్మాతకి గానీ సంబంధం లేదు. ఈ నెల‌లో నేను విడుదల‌ చేయబోతున్న ఐదో చిత్ర‌మిది. ఏ సినిమాకి థియేటర్ల విషయంలో సమస్య రాలేదు. కానీ ఈ సినిమా విషయంలోనే ఎగ్జిబ్యూటర్స్ ఒత్తిడికి గురయ్యారు. నేను ఇండస్ట్రీలో చాలా రోజులుగా ఉన్నాను. నాకూ కొంత మంది ఎగ్జిబ్యూటర్స్, డిస్ట్రిబ్యూటర్స్‌ ఉన్నారు. ఆ పరిచయాలతో సినిమాని విడుదల చేస్తున్నా. విడుదల‌ను ఆపేది లేదు’ అని అన్నారు. 

Voter Distributor Serious Warning:

Voter Movie Latest Update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ