Advertisementt

‘అరుంధ‌తి-2’లో హీరోయిన్ ఎవరంటే?

Fri 21st Jun 2019 08:30 PM
payal rajput,arundhati 2,heroine,koti tumula  ‘అరుంధ‌తి-2’లో హీరోయిన్ ఎవరంటే?
Young Heroine in Arundhati 2 Movie ‘అరుంధ‌తి-2’లో హీరోయిన్ ఎవరంటే?
Advertisement
Ads by CJ

‘అరుంధ‌తి-2’లో పాయ‌ల్ రాజ్ పుత్

శ్రీ శంఖుచ‌క్ర ఫిలింస్ ప‌తాకంపై పాయ‌ల్ రాజ్ పుత్ ప్ర‌ధాన పాత్ర‌లో కోటి తూముల నిర్మిస్తోన్న చిత్రం ‘అరుంధ‌తి-2’. చారిత్రాత్మ‌క నేప‌థ్యంతో కూడిన క‌థాంశంతో భారీ బ‌డ్జెట్ తో, భారీ గ్రాఫిక‌ల్ చిత్రంగా  ప్ర‌ముఖ  నిర్మాణ సంస్థ‌ల సంయుక్త భాగ‌స్వామ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది. 

ఈ సంద‌ర్బంగా చిత్రం గురించి నిర్మాత కోటి తూముల మాట్లాడుతూ.. ‘‘ చారిత్రాత్మ‌క, యూనివ‌ర్శల్ క‌థాంశంతో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో పాయ‌ల్ రాజ్ పుత్ తో పాటు బాలీవుడ్, కోలీవుడ్ కి చెందిన ప్ర‌ముఖ తార‌లు న‌టిస్తున్నారు. పాన్ ఇండియా చిత్రంగా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ విజువలైజేష‌న్ గ్రాఫిక‌ల్ వ‌ర్క్స్ హాలీవుడ్ సాంకేతిక నిపుణుల ఆధ్వ‌ర్యంలో జ‌రుగుతున్నాయి. క‌థాంశంలో భాగంగా హీరోయిన్ పాయ‌ల్ రాజ్ పుత్.. గుర్ర‌పుస్వారీ, క‌త్తి సాముల‌కు సంబంధించిన శిక్ష‌ణ హాలీవుడ్ స్టంట్ మాస్ట‌ర్స్ వ‌ద్ద‌ తీసుకుంటోంది. అతి త్వ‌ర‌లో షూటింగ్ ప్రారంభించ‌బోయే ఈ చిత్రానికి సంబంధించిన ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాలు అధికారికంగా వెల్ల‌డిస్తాం’’ అన్నారు.

Young Heroine in Arundhati 2 Movie:

Payal Rajput in Arjundathi 2 Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ