తమిళ నటి అమలా పాల్ లేటెస్ట్ మూవీ ‘ఆడై’ టీజర్ కొన్ని రోజుల కిందట రిలీజ్ అయ్యి యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. కారణం ఈ టీజర్ లో హీరోయిన్ అమలా పాల్ కొన్ని షాట్స్ లో బట్టలు లేకుండా కనిపించింది. టీజర్ చూసిన ప్రేక్షకులు అమలా పాల్ సాహసానికి మెచ్చుకున్నారు.
ఆమె కొన్ని షాట్స్‌లో నగ్నంగా నటించినందుకు ప్రశంసల వర్షం కురిసింది. పాత్ర కోసం ప్రాణం పెట్టింది అని అంటున్నారు. దాంతో సినిమాపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. టీజర్ ఇలా ఉంటే సినిమా ఎలా ఉంటుందో అని ప్రేక్షకులు ఇప్పటినుండే ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే మూవీలో ఇటువంటి షాట్స్ చాలానే ఉంటాయని చిత్ర వర్గాలు చెప్పాయి.
రీసెంట్ గా సెన్సార్ బోర్డు మాత్రం వీరికి షాకిచ్చింది. మూవీలో ఉన్న పలు నేక్‌డ్ షాట్స్ పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారట. వాటిని తొలగించడమో, డీఫోకస్ చేయడమో, వేరే వాటితో రీప్లేస్ చేయడమో చేయాలని చెప్పారట. దాంతో ఈ సినిమాకి ‘ఏ’ సర్టిఫికెట్ జారీ చేశారట. అంటే టీజర్ లో మాదిరిగా సినిమాలో ఉండకపోవచ్చు అంటున్నారు.