‘బంధం రేగడ్’ అనే ఇండిపెండెంట్ మూవీతో అందరి దృష్టిని ఆకర్షించిన సాహిత్ మోత్‌కూరి జంతు నేపథ్యంలో యూనిక్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రం ‘సవారి’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. నందు, ప్రియాంక శర్మ జంటగా నటించారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. ఇందులో ఓ గుర్రంతో హీరో హీరోయిన్స్ ఉన్నారు. టైటిల్‌కు తగ్గట్టుగానే ఫస్ట్‌లుక్‌ను డిజైన్ చేసి విడుదల చేశారు. ఔట్ అండ్ ఔట్ న్యూ ఏజ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్. రా కంటెంట్‌తో పాటు ఎగ్జయిట్‌మెంట్ డ్రామా ఇది. ఈ సినిమాలో గుర్రం పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా, ఫ్రెష్ స్టోరి టెల్లింగ్‌తో సినిమా ఉంటుందని, ప్రస్తుతం ఈ చిత్రం తుది దశ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుందని నిర్మాతలు తెలిపారు. కాల్వ నరసింహ స్వామి ప్రొడక్షన్స్, నిషా ఫిలింస్ పతాకాలపై సంతోశ్ మోత్‌కూరి, నిషాంక్ రెడ్డి కుడితి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
నటీనటులు:
నందు
ప్రియాంక శర్మ
శ్రీకాంత్ రెడ్డి గంటా
మ్యాడీ
జీవన్
శివ
సాంకేతిక వర్గం:
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: సాహిత్ మోత్‌కూరి
నిర్మాతలు: సంతోశ్ మోత్‌కూరి, నిషాంక్ రెడ్డి కుడితి
బ్యానర్: కాల్వ నరసింహ స్వామి ప్రొడక్షన్స్, నిషా ఫిలింస్
సంగీతం: శేఖర్ చంద్ర
ఎడిటర్: సంతోశ్ మీనం
సినిమాటోగ్రఫీ: మోనిశ్ భూపతిరాజు
ఆర్ట్: అర్జున్ సూరి శెట్టి
డిఐ: విష్ణు వర్ధన్
ఆడియోగ్రఫీ: రాధాకృష్ణ
ప్రొడక్షన్: అభిజీత్ గుమడవెల్లి
పబ్లిసిటీ డిజైన్: అనీల్ భాను
పి.ఆర్.ఒ: వంశీ శేఖర్