Advertisementt

క్రికెట్ ఎఫెక్ట్: ‘ఇస్మార్ శంక‌ర్’ వాయిదా!

Sat 22nd Jun 2019 07:24 PM
ismart shankar,release details,postponed,cricket world cup,puri jagannadh,ram  క్రికెట్ ఎఫెక్ట్: ‘ఇస్మార్ శంక‌ర్’ వాయిదా!
Ismart Shankar Release Postponed క్రికెట్ ఎఫెక్ట్: ‘ఇస్మార్ శంక‌ర్’ వాయిదా!
Advertisement
Ads by CJ

ఎనర్జిటిక్ స్టార్ రామ్‌, డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గన్నాథ్ ‘ఇస్మార్ శంక‌ర్’ వాయిదా

ఎనర్జిటిక్ స్టార్ రామ్‌, డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గన్నాథ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం ‘ఇస్మార్ట్ శంక‌ర్‌’. నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేశ్ హీరోయిన్స్‌. పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ ప‌తాకాల‌పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టాకీ పార్ట్ అంతా పూర్త‌య్యింది. సాంగ్స్ చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది. మ‌ణిశ‌ర్మ సంగీత సార‌థ్యం వ‌హిస్తున్న ఈ సినిమాలో ఇప్ప‌టికే మూడు పాట‌లు విడుద‌ల‌య్యాయి. టీజ‌ర్ కూడా విడుద‌లైంది. సాంగ్స్‌, టీజ‌ర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. 

జూలై 12న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయాల‌నుకున్నారు. అయితే క్రికెట్ ప్రపంచ వ‌రల్డ్ క‌ప్ పోటీల కార‌ణంగా ఈ సినిమా విడుద‌ల‌ను వాయిదా వేశారు. జూలై 14న వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్స్ జ‌రగ‌నుంది. ఈ త‌రుణంలో ప్రేక్ష‌కులు క్రికెట్‌ను చూసి ఆస్వాదించ‌డానికే అధిక ప్రాధాన్య‌త ఇస్తారు. ఇది బాక్సాఫీస్‌పై ఎఫెక్ట్ ప‌డుతుంద‌ని ‘ఇస్మార్ట్ శంక‌ర్‌’ ద‌ర్శ‌క నిర్మాత‌లు భావించి  చిత్ర యూనిట్‌తో చ‌ర్చ‌లు జ‌రిపారు. ఇప్పుడు సినిమా జూలై 12న కాకుండా జూలై 18న విడుద‌ల కానుంది. 

Ismart Shankar Release Postponed :

Ismart shankar release on July 18

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ