Advertisementt

పెద్ద హీరో అయితే ఈ మూవీ భలే ఉండేది!

Sun 23rd Jun 2019 05:50 PM
naveen polisetty,agent sai srinivasa athreya,movie,box office,collections  పెద్ద హీరో అయితే ఈ మూవీ భలే ఉండేది!
Agent Sai Srinivasa Athreya Movie Box office Collections పెద్ద హీరో అయితే ఈ మూవీ భలే ఉండేది!
Advertisement
Ads by CJ

ఈ శుక్రవారం విడుదలైన సినిమాల్లో రెండు మూడు సినిమాలకు మాత్రమే పాజిటివ్ టాక్స్ పడ్డాయి. ప్రేక్షకుల నుండి రివ్యూ రైటర్స్ నుండి ఆ రెండు సినిమాలకు మంచి మార్కులు పడ్డాయి. అందులో ఒకటి ప్రియదర్శి మల్లేశం సినిమా. రెండోది నవీన్ పోలిశెట్టి ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ. నవీన్ పోలిశెట్టి తెలుగు తెరకు పరిచయమే కానీ... ఓ అన్నంతగా ప్రేక్షకులకు తెలియదు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ తో ప్రేక్షకులకు పరిచయమైన నవీన్.. హిందీ వెబ్ సీరీస్ తోనూ, హిందీ టివి షోస్ తోనూ బాగా పాపులర్ అయ్యాడు. ముంబైలో కూర్చుని వెబ్ సీరీస్ చేస్తూ ఫేమస్ అయిన నవీన్ పోలిశెట్టి.. తెలుగులో హీరోగా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో పరిచయమయ్యాడు. ఆ సినిమాకి పాజిటివ్ టాక్ పడడమే కాదు.. రివ్యూ రైటర్స్ కూడా పాజిటివ్ రివ్యూస్ ఇచ్చారు. చాలారోజుల నుండి బాగా డల్ గా వున్న బాక్సాఫీసు ఇప్పుడు కాస్త కళకళలాడుతుంది.

ఇకపోతే ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా హిట్ టాక్ పడినా.. నిర్మాతలకు ఎంత వర్క్ అవుట్ అవుతుందో చెప్పలేమంటున్నారు. కారణం ఈ సినిమా కథ, కథనం బావున్నప్పటికీ.. నవీన్ పోలిశెట్టికి పెద్దగా క్రేజ్ లేకపోవడం వలన కమర్షియల్‌గా ఏ మేరకు సక్సెస్ అవుతాడన్నదే చెప్పలేని పరిస్థితి. అదే ఈ సినిమాలో ఏదైనా యంగ్ అండ్ క్రేజ్ ఉన్న హీరో నటించినా.. అలాగే సినిమాకి తగినంత బడ్జెట్ పెట్టినా సినిమా కమర్షియల్‌గా వర్కౌట్ అయ్యేది అని అంటున్నారు. ఈ కథ మీద ఇంకొంచెం వర్క్ చేసి.. కన్విన్సింగ్‌గా ఉండేలా చూసుకుని ఉంటే సినిమా మరింతగా ప్రేక్షకుల్లోకి వెళ్లేదని అంటున్నారు. అలాగే ప్రమోషన్స్ కూడా ఇంకా చేస్తే సినిమాకి మంచి కలెక్షన్స్ వస్తాయంటున్నారు. చూద్దాం ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ హిట్ టాక్ తో ఎంత కొల్లగొడుతుందో అనేది.

Agent Sai Srinivasa Athreya Movie Box office Collections:

Agent Sai Srinivasa Athreya Movie Updates

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ