నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో వి.ఆనందప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం లాంఛనంగా ప్రారంభం!
యూత్ స్టార్ నితిన్ హీరోగా, అభిరుచి గల దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో, వి.ఆనందప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం పూజా కార్యక్రమాలు ఆదివారం హైదరాబాద్‌లో లాంఛనంగా జరిగాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన శైలితో అందరినీ అలరించే చిత్రాలను తెరకెక్కిస్తున్న భవ్య క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్‌సింగ్, ప్రియా పి. వారియర్ కథానాయికలుగా నటిస్తున్నారు. సంస్థ కార్యాలయంలో జరిగిన ముహూర్తపు సన్నివేశానికి చిత్ర నిర్మాత వి. ఆనంద ప్రసాద్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి క్లాప్‌కొట్టారు.
ఈ చిత్రం గురించి నిర్మాత వి. ఆనందప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘యూత్‌స్టార్ నితిన్ కి పక్కాగా సరిపోయే కథతో సినిమా తీస్తున్నాం. ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో హీరోగా నటించిన ఆయన కెరీర్‌లో ఇది చెప్పుకోదగ్గ సినిమా అవుతుంది. చంద్రశేఖర్ యేలేటిగారి దర్శకత్వంలో సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూసే ప్రేక్షకుల గురించి నాకు బాగా తెలుసు. ఆయన తీసుకునే పాయింట్ అంత గొప్పగా, వైవిధ్యంగా ఉంటుంది. మా కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా కూడా చాలా కొత్తగా ఉంటుంది. అన్ని రకాల ప్రేక్షకులను అలరిస్తుంది. కీరవాణిగారి సంగీతం కూడా మా సినిమాకు పెద్ద ఎసెట్ అవుతుంది. హీరోయిన్లుగా రకుల్, ప్రియా ప్రకాష్ వారియర్ నటిస్తున్నారు. రకుల్ ఇంతకు ముందు మా సంస్థలో ‘లౌక్యం’లో నటించారు. యూత్‌లో ప్రియా ప్రకాష్ వారియర్ కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పనిలేదు. ఆమెను తెలుగులో మా సంస్థ ద్వారా పరిచయం చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఇతర నటీనటుల ఎంపిక జరుగుతోంది. షూటింగ్ వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం’’ అని చెప్పారు.
నటీనటులు:
నితిన్, రకుల్ ప్రీత్‌సింగ్, ప్రియా పి.వారియర్ తదితరులు
సాంకేతిక నిపుణులు
నిర్మాణం: భవ్య క్రియేషన్స్, ప్రొడక్షన్ నెం.12
రచన, దర్శకత్వం: చంద్రశేఖర్ యేలేటి
నిర్మాత: వి. ఆనందప్రసాద్
ఛాయాగ్రహణం: రాహుల్ శ్రీవాస్తవ్
సంగీతం: కీరవాణి
రచనా సహకారం, మాటలు: వెంకట్ నరేష్ రెడ్డి
కళా దర్శకత్వం: వివేక్ అన్నామలై
కాస్ట్యూమ్స్: కృష్ణ శాంతి
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: పి.యల్.యం.ఖాన్