హిందీలో హృతిక్ రోషన్ లాంటి స్టార్ హీరోతో చేసినా ఆమెకు పరాజయం తప్పలేదు. అందుకే సౌత్ పై కన్నేసి తెలుగులో వరస సినిమాల అవకాశాలు దక్కించుకుంటుంది. ప్రస్తుతం తెలుగులో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిన పూజా హెగ్డే మరోసారి బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని సిద్ధమైంది.
ఇమ్రాన్ హస్మి, జాన్ అబ్రహాం హీరోలుగా నటిస్తున్న సినిమాలో ఈమెకు ఛాన్స్ వచ్చింది. సంజయ్ గుప్తా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో జాకీష్రాఫ్, సునీల్ షెట్టి, గుల్షన్ గ్రోహర్ ఇతర ముఖ్యపాత్రలు పోషించబోతున్నారు. టి-సిరీస్ వారు నిర్మిస్తున్న ఈసినిమాకి ‘ముంబయి సాగ’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు.
తెలుగులో అయితే వరస ఆఫర్స్ తో ఫుల్ బిజీగా ఉన్న ఈ బ్యూటీ ఈసారన్నా బాలీవుడ్ లో క్లిక్ అవుతుందేమో చూద్దాం.