Advertisementt

ఫుల్ ఫ్లెడ్జెడ్ హీరోగా తేజ సజ్జ

Tue 25th Jun 2019 06:18 PM
teja sajja,samantha,oh baby movie,grand son  ఫుల్ ఫ్లెడ్జెడ్ హీరోగా తేజ సజ్జ
Child Artist Turns Full Pledged Hero ఫుల్ ఫ్లెడ్జెడ్ హీరోగా తేజ సజ్జ
Advertisement
Ads by CJ

చైల్డ్ ఆర్టిస్టులు పెద్దయ్యాక హీరోలుగా ఎంట్రీ ఇవ్వడం కామన్. ఆ కోవలోనే హీరోగా మారుతున్నాడు మాస్టర్ తేజ. చైల్డ్ ఆర్టిస్ట్ గా చూడాలని ఉంది, ఇంద్ర, యువరాజు, బాచి వంటి సినిమాల్లో అద్భుతంగా నటించిన కుర్రాడే ఈ తేజ. బాలనటుడుగా యాభై సినిమాల వరకూ నటించిన మాస్టర్ తేజ ఇప్పుడు మిస్టర్ తేజగా రాబోతున్నాడు. బ్యూటీఫుల్ యాక్ట్రెస్ సమంత ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘ఓ బేబీ’ సినిమాలో సమంతకు మనవడుగా నటించాడు. లేటెస్ట్ గా విడుదలైన ట్రైలర్ లో తేజ ప్రామిసింగ్ గా కనిపిస్తున్నాడు. మంచి ఈజ్ తో నటించనట్టు తెలుస్తుంది. తన లుక్ చూసి చాలామంది ‘‘ఇతనేనా చిన్ననాటి ఇంద్ర’’ ఆశ్చర్యపోతున్నారు..

ఇప్పుడు తేజ సజ్జ హీరోగా కూడా వరుసగా సినిమాలు చేయబోతున్నాడు. దానికోసం మంచి లైనప్ కూడా సెట్ చేసుకున్నాడు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో తేజ సజ్జ ఆల్రెడీ హీరోగా ఓ సినిమా కూడా చేయబోతున్నాడు. అంతే కాదు.. ఓ హ్యాపెనింగ్ యంగ్ డైరెక్టర్ -ఎస్టాబ్లిష్‌డ్ బ్యానర్ కలయికలో మరో సినిమా కూడా ఫైనల్ అయిందని సమాచారం. దానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ త్వరలో రాబోతుంది. మొత్తానికి చైల్డ్ ఆర్టిస్టుగా మెప్పించిన తేజ మంచి హీరోగా కూడా సెటిలయ్యే లక్షణాలు కనిపిస్తున్నాయి.

Child Artist Turns Full Pledged Hero:

Teja Sajja in Samantha OH Baby Movie