Advertisementt

బ్రోచేవారెవరురా శాటిలైట్ రేట్ వింటే షాక్!

Tue 25th Jun 2019 10:01 PM
sri vishnu,brochevarevaruraa,satellite rights,3 crores  బ్రోచేవారెవరురా శాటిలైట్ రేట్ వింటే షాక్!
Shocking Satellite Rights to Brochevarevaruraa బ్రోచేవారెవరురా శాటిలైట్ రేట్ వింటే షాక్!
Advertisement
Ads by CJ

మరో నాలుగు రోజుల్లో శ్రీవిష్ణు, నివేత థామస్, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ నటించిన బ్రోచేవారెవరురా రిలీజ్ అవ్వబోతుంది. సోషల్ మీడియాలో అయితే ఈమూవీకి బజ్ ఉంది కానీ సాధారణ ప్రేక్షకుల్లో ఈసినిమాపై ఎటువంటి అంచనాలు లేవు. అందుకు తగ్గట్టుగానే ఈసినిమా యొక్క బిజినెస్ కూడా అంతంతమాత్రంగానే జరిగింది. అయితే ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఈ సినిమాకు బంపర్ ఆఫర్ తగిలింది. రిలీజ్ కి ముందే ఈసినిమా యొక్క శాటిలైట్ డీల్ లాక్ అయింది. ఏకంగా ఈమూవీ 3 కోట్ల రూపాయలకు అమ్ముడైంది.

రిలీజ్ కి ముందే ఈ చిన్న సినిమాకి ఇంత బిజినెస్ జరగడం గొప్ప విషయమే. మరి ముఖ్యంగా శ్రీవిష్ణు సినిమాకి జరగడం విశేషమే. శ్రీవిష్ణు గత సినిమాలు చాలావరకు శాటిలైట్ కు నోచుకోకుండా అలా పడి ఉన్నాయి. కానీ ఈసినిమా రిలీజ్ కి ముందే ఇలా అమ్ముడుపోయిందంటే అది చెప్పుకోదగ్గ విషయమే కదా. ట్రైలర్, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ రావడంతోనే ఇంత త్వరగా అండ్ ఇంత రేట్ కి శాటిలైట్ అమ్ముడుపోయిందని చెబుతున్నారు. యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేసిన ఈ సినిమా రిజల్ట్ ఏంటో మరో కొన్నిరోజుల్లో తెలిసిపోనుంది.

Shocking Satellite Rights to Brochevarevaruraa:

3 Crore Satellite to Brochevarevaruraa

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ