Advertisementt

బిగ్‌బాస్‌లోకి నేనా.. షోకు ముందే 30లక్షలు!: లాస్య

Wed 26th Jun 2019 06:02 PM
anchor lasya,reacted,bigg boss 3,entry,rumours  బిగ్‌బాస్‌లోకి నేనా.. షోకు ముందే 30లక్షలు!: లాస్య
Anchor Lasya Reacted on Bigg Boss Entry Rumours బిగ్‌బాస్‌లోకి నేనా.. షోకు ముందే 30లక్షలు!: లాస్య
Advertisement
Ads by CJ

తెలుగు బిగ్‌బాస్-3కు కంటెస్టెంట్‌గా యాంకర్ లాస్య వెళ్తున్నారని గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన విషయం విదితమే. అయితే ఈ పుకార్లు అన్నీ పట్టించుకోనక్కర్లేదని లాస్య లైట్ తీసుకున్నా.. వార్తలు రోజురోజుకు ఎక్కువవడంతో ఎట్టకేలకు సోషల్ మీడియా వేదికగా ఈ పుకార్లకు ఫుల్‌స్టాప్ పెట్టాలని భావించి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను లాస్య పోస్ట్ చేసింది.

‘‘బిగ్‌బాస్‌లోకి నేనా.. వచ్చేస్తున్నా..(నవ్వుతూ..) లాస్య ఎంట్రీ కన్ఫార్మ్‌ అయిపోయిందని షో ప్రారంభానికి ముందే 30 లక్షల రూపాయలు ఇచ్చారు.. అబ్బా ఇది వినడానికి ఎంత బాగుందో కదా.. కానీ ఇదంతా పచ్చి అబద్ధం.. ఇట్స్‌ ఆల్ ఏ ఫేక్‌ న్యూస్‌. నాకు చిన్నబాబు ఉన్నాడు.. వాడితో గడిపేందుకే టైమ్‌ సరిపోతుంది. ఈ ఏడాది పూర్తిగా బాబుతోనే.. ఏదైనా ఉంటే నెక్ట్స్‌ టైమ్‌ చూద్దాం’’ అని లాస్య చెప్పుకొచ్చింది.

ఫైనల్‌గా లాస్య కూడా బిగ్‌బాస్‌లోకి ఎంట్రీపై క్లారిటీ ఇచ్చేసిందన్న మాట. ఈ మధ్యకాలంలోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన లాస్య దంపతులు.. హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ తరుణంలో బిగ్‌బాస్ 3లో కంటెస్టెంట్‌గా వెళ్తోందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో పై విధంగా రియాక్ట్ అయ్యింది.

Anchor Lasya Reacted on Bigg Boss Entry Rumours:

Lasya Clarity on Bigg Boss Telugu Season 3 Entry

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ