Advertisementt

ఈ వారం విజేత ఎవరో?

Thu 27th Jun 2019 04:18 PM
kalki,burrakatha,brochevarevarura,movies,release  ఈ వారం విజేత ఎవరో?
Kalki And Burrakatha Ready to Release ఈ వారం విజేత ఎవరో?
Advertisement
Ads by CJ

వచ్చే శుక్రవారం మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మూడు సినిమాలు మూడు జోనర్లలో తెరకెక్కిన సినిమాలు కావడం.. మూడు సినిమా ట్రైలర్స్ ప్రేక్షకులకు ఆసక్తిని కలిగించడంలో సఫలమవడంలో.. ఈవారం బాక్సాఫీసు కళకళలాడేలా కనబడుతుంది. గత శుక్రవారం ఐదారు సినిమాలు విడుదలైతే అందులో మల్లేశం, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాలు మాత్రమే ప్రేక్షకులు మెచ్చేవిలా వున్నాయి. ఇక వచ్చే శుక్రవారం రాజశేఖర్ కల్కి సినిమాతో పాటుగా ఆది సాయి కుమార్ బుర్రకథ, ఇంకా శ్రీ విష్ణు బ్రోచేవారెవరురా అనే డిఫ్రెంట్ కాస్సెప్ట్ లతో తెరకెక్కిన సినిమాలు విడుదల కాబోతున్నాయి. రాజశేఖర్ పిఎస్వి గరుడ వేగ హిట్ తర్వాత రాబోతున్న కల్కి సినిమా మీద మంచి అంచనాలే ఉన్నాయి. కల్కి టీజర్, పోస్టర్స్ అన్ని ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగాల్సింది.. రాజశేఖర్ కి అనారోగ్య కారణాల చేత ఆ ఈవెంట్ వాయిదా పడింది కానీ.. సినిమా ప్రమోషన్స్ మాత్రం పీక్స్ లో ఉన్నాయి. దర్శకుడు ప్రశాంత్ వర్మతో పాటుగా రాజశేఖర్ కూడా కల్కి సినిమా హిట్ అవుతుందని బలంగా నమ్ముతున్నారు.

ఇక వరస డిజాస్టర్ తర్వాత అది సాయి కుమార్ నటించిన బుర్రకథ సినిమా మీద ముందులో అంతగా ఆసక్తి లేకపోయినా.. తాజాగా విడుదలైన బుర్రకథ ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఆ ట్రైలర్ చూసాక ఆది సాయి కుమార్ ఖచ్చితంగా హిట్ కొడతాడని కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇక ముచ్చటగా మూడో సినిమా శ్రీ విష్ణు - నివేద థామస్ ల బ్రోచేవారెవరురా సినిమా. సాలిడ్ హిట్స్ కొట్టే శ్రీ విష్ణు... నటనలో మేటి నటి నివేదతో జోడి కట్టడం, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కమెడియన్స్ గా ఈ సినిమాలో నటించడంతో పాటుగా బ్రోచేవారెవరురా టీజర్స్ కూడా ఆకట్టుకునేలా ఉండడంతో.. ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొని ఉంది. మరి మూడు సినిమాలు ప్రమోషన్స్ తో పోటీ పడుతున్నాయి. అలాగే బాక్సాఫీసు వద్ద కుడా నువ్వా నేనా అన్న రేంజ్ లో పోటీకి సిద్దమయ్యాయి. మరి ఈ వారం ఈ రసవత్తర పోటీలో గెలిచేదెవరో ప్రేక్షకులే నిర్ణయించాలి.

Kalki And Burrakatha Ready to Release:

This  Week Release Movies List

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ