Advertisementt

నటిస్తున్నా దాన్ని మాత్రం వదలా: సాయిపల్లవి

Sat 29th Jun 2019 07:12 AM
sai pallavi,dream,doctor,actress,sekhar kammula,fidaa,sai pallavi dream  నటిస్తున్నా దాన్ని మాత్రం వదలా: సాయిపల్లవి
Sai Pallavi About Her Dream నటిస్తున్నా దాన్ని మాత్రం వదలా: సాయిపల్లవి
Advertisement
Ads by CJ

తన నటనతో అందరిని ఫిదా చేస్తున్న సాయి పల్లవి తెలుగులో మంచి మంచి ఆఫర్స్ దక్కించుకుంటుంది. మలయాళంలో ప్రేమమ్ సినిమాతో చిత్ర పరిశ్రమకు పరిచయం అయినా ఈ బ్యూటీ కల డాక్టర్ కావాలని. అందుకు తగ్గట్టు చదువుతూనే ఉంది ఇప్పటికి. కాకపోతే సడన్ గా సినిమా అవకాశాలు రావడంతో ఇటువైపు వచ్చేసింది కానీ తనకు ఇష్టమైన స్టడీస్ మాత్రం వదిలిపెట్టలేదు. ప్రస్తుతం తనకు నచ్చిన పాత్రలు చేస్తూ నటనలోనే కొనసాగాలని పూర్తిగా నిర్ణయించుకుందట. 

ఎంతకాలం ఈ వృత్తిలో ఉండాలి అనిపిస్తే అంత కాలం ఇదే కొనసాగిస్తాదట. నటనలో ఉన్నంత మాత్రాన వైద్య వృత్తిని వదిలిపెట్టను. అలాగని వైద్యం చేయను అంటుంది. నటన నుండి పూర్తిగా విరమించుకున్న తర్వాత మాత్రం పూర్తి స్థాయి డాక్టర్ గా మారి ప్రజలకు వైద్యం అందిస్తాను. ఫ్యూచర్ లో గుండె వైద్య నిపుణురాలు కావాలని భావిస్తున్నానని తెలిపింది. ప్రస్తుతం ఈమె నాగ చైతన్య - శేఖర్ కమ్ముల సినిమాలో నటించనుంది. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో సాయి పల్లవి నటించడం ఇది రెండోసారి.

Sai Pallavi About Her Dream:

Again Sai Pallavi in Sekhar Kammula direction 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ