Advertisementt

బిగ్‌బాస్ 3: మాకొద్దంటే మాకొద్దు అంటున్నారు

Sat 29th Jun 2019 07:18 AM
contestants,bigg boss,season 3,telugu,nagarjuna  బిగ్‌బాస్ 3: మాకొద్దంటే మాకొద్దు అంటున్నారు
Bigg Boss 3: Waiting for Contestants బిగ్‌బాస్ 3: మాకొద్దంటే మాకొద్దు అంటున్నారు
Advertisement
Ads by CJ

మరికొన్ని రోజుల్లో నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 3 రెడీ అవ్వబోతుంది. అయితే ఇంతవరకు ఈ షో లో నటించే వారి పేరులు బయటికి రాలేదు. చాలామందికి ఈ షో నుండి ఆఫర్స్ వస్తున్నా మాకొద్దు బాబోయ్ అని దండం పెట్టేస్తున్నారట. కారణం ఈ షో తరువాత అవకాశాలు తగ్గే అవకాశముంది కాబట్టి.

ఈ షో చేసేవారికి వారానికి మంచి పారితోషికంతో పాటు ఇన్‌స్టంట్‌ క్రేజ్‌ లభిస్తుంది. అయితే ఆ క్రేజ్ తరువాత నెమ్మదిగా తగ్గిపోతుంది. తరువాత అవకాశాలు పై ఎఫెక్ట్ పడుతుంది. కౌశల్‌ మాదిరిగా ట్రెండ్‌ సెట్‌ చేసిన వారికే ఆ తర్వాత ఏమీ రాలేదంటే బిగ్‌ బాస్‌ ఎంతటి ఫేక్‌ హైప్‌ తీసుకొస్తుందనేది అర్థమవుతోంది. అలానే నటి తేజస్విని పరిస్థితి కూడా అంతే. ఈ షో కి ముందు అడపాదడపా అవకాశాలు వచ్చేవి కానీ ఇప్పుడు ఆ షోతో ఆమె పట్ల ఒక నెగెటివ్‌ ఇంప్రెషన్‌ వచ్చేసింది. దాంతో ఆమెకు అవకాశాలు రావడంలేదు. అందుకే ఇంట్లో కూర్చుని ఇన్‌స్టాగ్రామ్ లో ఫొటోస్ పెట్టుకుని టైం పాస్ చేస్తుంది.

బిగ్‌‌బాస్‌ 1 గెలిచినా శివ బాలాజీకి కూడా ప్రస్తుతం అవకాశాలు ఏమి లేవు. దీంతో అయిదు వారాల ఫేమ్‌ కోసం లేదా అయిదారు లక్షల కోసం పబ్లిక్‌లో తమ ఇమేజ్‌కి చిల్లు పెట్టుకోవడం దేనికని చాలా మంది ఈ షోకి దూరంగా వుంటున్నారు. చాలామంది సీజన్ 3 కోసం నో చెబుతున్నారు అని తెలుస్తుంది. అది మ్యాటర్.

Bigg Boss 3: Waiting for Contestants:

Contestants Jhalak to Bigg Boss Telugu season 3

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ