Advertisementt

శ్రీవిష్ణు, రాజశేఖర్.. విజేత ఎవరంటే..?

Sun 30th Jun 2019 06:08 PM
kalki,brochevaarevaruraa,sree vishnu,rajasekhar,winner,friday releases  శ్రీవిష్ణు, రాజశేఖర్.. విజేత ఎవరంటే..?
Sree Vishnu, Rajasekhar.. Who is the Winner? శ్రీవిష్ణు, రాజశేఖర్.. విజేత ఎవరంటే..?
Advertisement
Ads by CJ

 

నిన్న శుక్రవారం రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అసలైతే మూడు సినిమాలు బాక్సాఫీసు వద్దకు రావాల్సి ఉంది. కానీ మూడో సినిమా బుర్రకథ అనివార్య కారణాల వలన వాయిదా పడగా.. కల్కి, బ్రోచేవారెవరురా సినిమాలు మాత్రం విడుదలయ్యాయి. రాజశేఖర్ - అదా శర్మ - నందిత స్వేత హీరోహీరోయిన్స్ గా ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన కల్కి మాస్ ఎంటెర్టైనెర్ గా తెరకెక్కింది. శ్రీ విష్ణు - నివేత థామస్, సత్య దేవ్ - నివేత పేతురేజ్ జంటగా వివేక్ ఆత్రేయ కామెడీ ఎంటెర్టైనెర్ గా తెరకెక్కించిన బ్రోచేవారెవరురా సినిమాలు బాక్సాఫీసు వద్ద పోటీ పడ్డాయి. రాజశేఖర్ కల్కి కి మిక్స్‌డ్ టాక్ రాగా, బ్రోచేవారెవరురా సినిమాకి హిట్ టాక్ పడింది.

రాజశేఖర్ కల్కి సినిమాలో మాస్ శాతం ఎక్కువ కావడం, రాజశేఖర్ ఓవర్ మేకప్ తో పాటుగా ఆయన వయస్సు తెలిసిపోవడం, కథ, కథనంలో బలం లేకపోవడం, ఫస్ట్ వీక్ అవడంతో.. క‌థా నేప‌థ్యం బావున్నప్పటికీ, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సూపర్ గా ఉన్నప్పటికీ కల్కి సినిమాకి మిక్స్‌డ్ టాకే పడింది. స్క్రీన్ ప్లే వీక్ కావడం తో నటీనటుల నటన కూడా తేలిపోయింది. చివరి 20 నిముషాలు గనక కల్కి సినిమాని నిలబెట్టకపోతే.. ఈ సినిమా అట్టర్ ప్లాప్ అయ్యేదంటున్నారు. పిఎస్వీ గరుడ వేగ హిట్ కొట్టిన రాజశేఖర్ కల్కి తో హిట్ కొడతాడే అన్నారు. కానీ యావరేజ్ దగ్గరే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక శ్రీ విష్ణు నివేత జంటగా వచ్చిన బ్రోచేవారెవరురా సినిమాకి పాజిటివ్ అండ్ హిట్ టాక్ పడింది. శ్రీ విష్ణు నటన, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కామెడీ, నివేత థామస్ నటన, సినిమాటోగ్రఫీ, బ్యాగ్రౌండ్ స్కోర్, ఫస్ట్ హాఫ్ లో కామెడీ హిలేరియస్ గా పండడంతో ఈ సినిమాకి హిట్ టాక్ పడింది. అయితే సెకండ్ హాఫ్ లో స్లోగా సాగే సన్నివేశాలు, కథలో బలం లేకపోవడం వంటి నెగెటివ్ పాయింట్స్ తప్ప బ్రోచేవారెవరురా సినిమా సాలిడ్ హిట్ కొట్టింది. మరి ఈ వారం శ్రీ విష్ణు నే రాజశేఖర్ మీద గెలిచాడన్నమాట.

Sree Vishnu, Rajasekhar.. Who is the Winner?:

Kalki gets mixed talk, Brochevarevaruraa gets Hit talk

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ