Advertisementt

రాజశేఖర్ పని అయిపోయినట్లేనా?

Sun 30th Jun 2019 06:21 PM
rajasekhar,kalki movie,mixed talk,rajasekhar expressions  రాజశేఖర్ పని అయిపోయినట్లేనా?
Comments on Rajasekhar Expressions in Kalki Movie రాజశేఖర్ పని అయిపోయినట్లేనా?
Advertisement
Ads by CJ

యాంగ్రీ మాన్ రాజశేఖర్ గరుడ వేగ సినిమాతో చాలా ఏళ్ళు తరువాత మళ్లీ లైమ్ లైట్లోకి వచ్చాడు. ఈ సినిమా క్రిటిక్స్ పరంగా, ప్రేక్షకుల పరంగా నచ్చినప్పటికీ ఫ్యాన్స్ కి మాత్రం రాజశేఖర్ లుక్ పై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయనలో మునుపటి జోష్ లేదని...ఎనర్జీ లేదని..శారీరకంగా మార్పులు వచ్చాయని ఫ్యాన్స్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు.

ఇదివరకు చేసిన సినిమాలతో పోల్చుకుంటే గరుడ వేగలో ఆ జోష్ కనిపించలేదని అభిప్రాయపడ్డారు. అయితే గరుడ వేగలో జరిగిన తప్పులు కల్కి లో జరగకూడదని రాజశేఖర్ లుక్స్ విషయంలో చాలానే జాగ్రత్తలు తీసుకున్నారు. కాస్త ఒళ్లు చేసి, ముఖంలో కళ తెచ్చుకునే ప్రయత్నం చేస్తాడని అనుకున్నారు. కానీ కల్కి తో పోల్చుకుంటే గరుడ వేగ లోనే బెటర్ గా ఉన్నాడనే ఫీలింగ్ కలిగిందని ప్రేక్షకులకు భావిస్తున్నారు.

చర్మంపై ముడతలు రావడం, విగ్గు సరిగా కుదరకపోవడం.. మేకప్ తేడా కొట్టడం.. మొహంలో కళ పోవడం జరిగాయి. పూర్తిగా నీరసించి.. ఎనర్జీయే లేనట్లు కనిపించిన రాజశేఖర్‌ను చూసి జనాలు షాకైపోయారు. ఆ బాడీతో అతను ఫైట్స్ చేస్తుంటే చూడ్డానికే ఏదోలా అనిపించిందని అంటున్నారు. ఈమూవీ రాజశేఖర్ కాకుండా మంచి యంగ్ హీరో చేసి ఉంటే వేరేలా ఉండేదని అంటున్నారు సాధారణ ప్రేక్షకులు.

Comments on Rajasekhar Expressions in Kalki Movie:

Rajasekhar Kalki Released and gets Mixed talk

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ