బేబీ ఢమరి సమర్పణలో శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘ఎర్రచీర’. సత్య సుమన్ బాబు దర్శకత్వం వహిస్తున్నారు. హారర్ యాక్షన్ సస్పెన్స్ ప్రధానంగా రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇది. ఈ చిత్రంలో శతాధిక చిత్రాల హీరో శ్రీకాంత్ ఓ కీలక పాత్రలో నటించనున్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు సత్య సుమన్ బాబు మాట్లాడుతూ.. ‘ఎర్ర చీరలో శతాధిక చిత్రాల హీరో శ్రీకాంత్ నటించడం ప్రత్యేక ఆకర్షణ. ఆయన పాత్ర అంతే ఆసక్తికరంగా ఉంటుంది. కథలో ఎంతో కీలకపాత్రను చేస్తున్నారు. ఆయనకు ధన్యవాదాలు. ఇక ఈ సినిమాలో శ్రీరాం.. అలీ పాత్రలు ఆకట్టుకుంటాయి. ఛేజింగ్ సీన్స్... హారర్, కామెడీ సన్నివేశాలు అబ్బురపరుస్తాయి’ అన్నారు.
ఎగ్జిక్యూటివ్ నిర్మాత తోట సతీష్ మాట్లాడుతూ.. రాజీ లేకుండా రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని ఆగస్టు చివరి వారంలో లేదా సెప్టెంబర్ మొదటి వారంలో లీజ్ చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నామన్నారు. ఈ చిత్రానికి మాటలు: గోపీ విమల పుత్ర, కెమెరా: చందు, ఫైట్స్: నందు, కళ: సుభాష్- నాని, కథ-కథనం-దర్శకత్వం: సత్య సుమన్ బాబు.