కన్నడ క్యూటీ రష్మిక ప్రస్తుతం విజయ్ దేవరకొండతో రెండోసారి జంటగా నటిస్తున్న చిత్రం ‘డియర్ కామ్రేడ్’. యూత్ ఫుల్ లవ్ స్టోరీతో సాగే ఈసినిమా యొక్క షూటింగ్ రీసెంట్ గా కంప్లీట్ అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీగా ఉన్న ఈసినిమా త్వరలోనే రిలీజ్ కానుంది. తాజాగా ఈచిత్రం నుండి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది.
ఈమూవీలో రొమాంటిక్ సీన్స్ చాలానే ఉన్నాయట. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే సీన్స్, లిప్ కిస్ లు కాస్త ఘాటుగానే ఉంటాయని తెలుస్తోంది. ఈ రొమాంటిక్ సీన్స్ కి రష్మిక ఎటువంటి కండిషన్స్ పెట్టకుండా ఓకే చెప్పేసిందని టాక్. సెకండ్ హాఫ్ లో యూత్ కి కనెక్ట్ అయ్యే ఓ రొమాంటిక్ సాంగ్ అయితే చాలా బాగా వచ్చిందని టాక్.
ఇక ఈమూవీ జూలై 26 న సౌత్ లో దాదాపు అన్ని భాషల్లో రిలీజ్ కానుంది. ఇందులో విజయ్ మెడికల్ స్టూడెంట్ గా కనిపించనున్నాడు. కొత్త దర్శకుడు భరత్ కమ్మ ఈసినిమాను డైరెక్ట్ చేసాడు. ఈసినిమా తరువాత విజయ్, క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో చేస్తున్నాడు.