మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ చిత్రం సైరా అక్టోబర్ 2 న రిలీజ్ అవ్వనుంది. రిలీజ్ కి రెడీ అవుతున్న ఈసినిమాకి కొత్త ఇబ్బందులు వచ్చిపడ్డాయి. రెండు రోజులు కిందట ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కుటుంబ సభ్యులు కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ కార్యాలయం ఎదుట గొడవ చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. సైరా కథ రైట్స్ కోసం బాండ్ రాయించుకున్న కొణిదెల టీం ఇప్పుడు ముఖం చాటేస్తోందని సదరు ఫ్యామిలీ మెంబర్స్ ఆరోపించారు. అసలు ఇందులో ఎంతవరకు నిజముందో అని ఆరా తీస్తే కొన్ని ఆసక్తికర విషయాలు తెలిసాయి.
కొణిదెల టీమ్ ఉయ్యాలవాడ ఫ్యామిలీతో ముందుగానే బాండ్ కుదుర్చుకున్న మాట వాస్తమే. అందులో ఉయ్యాలవాడ ఫ్యామిలీకి సైరా టీం లక్షల్లో డబ్బు ఇస్తామని రాయించుకుంది. అందుకు కొణిదెల టీమ్ రెడీగా ఉంది. అయితే ఇప్పుడు ఉయ్యాలవాడ ఫ్యామిలీ ఏకంగా రూ.8కోట్లు డిమాండ్ చేశారని.. అయితే డిమాండ్ మితిమీరడంతో కాంపన్సేషన్ అంత ఇవ్వలేమని చెప్పేశారని తెలుస్తోంది. కథ హక్కులుతో పాటు.. ఈచిత్ర షూటింగ్ టైములో ఆ విలేజీని ‘సైరా’ టీమ్ ఉపయోగించుకుంది. ఆ షూటింగ్ చేస్తున్నప్పుడు పంట పాడైందని .. వీటన్నిటికీ రూ.8కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారని తెలుస్తోంది.
అందుకు కొణిదెల టీమ్ ససేమీరా అంటుంది. మరి ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదురుతుందా.. లేదా అనేది కొన్ని రోజుల్లో తెలియనుంది. ఇక ఈసినిమాను యంగ్ డైరెక్టర్ సురేంద్ర రెడ్డి డైరెక్ట్ చేసారు. ఓ ముఖ్య పాత్రలో అనుష్క కనిపించనుంది.