‘కార్తికేయ, కేశవ’ లాంటి చిత్రాలతో హీరోగా మంచి పేరు తెచ్చుకున్న నిఖిల్ కి ఇంకా బ్యాడ్ టైం నడుస్తూనే ఉంది. గత ఏడాదేప్పుడో విడుదల కావాల్సిన అర్జున్ సురవరం ఇప్పటికీ విడుదల కాలేదు. అసలెప్పుడు విడుదలవుతుందో ఆ యంగ్ హీరో నిఖిల్ కూడా చెప్పలేని పరిస్థితి. అసలు నిఖిల్ కూడా అర్జున్ సురవరం సినిమాతో ఎలాంటి సంబంధం లేనట్టుగా వ్యవహరించడంతో.. ఇక ఆ సినిమా విడుదల అనేది జరిగే పనిలా కనిపించడం లేదు. మరి అర్జున్ సురవరంతో మొదలైన బ్యాడ్ టైం నిఖిల్‌ని ఇంకా వదలలేదు.
నిఖిల్ ది బ్యాడ్ టైం అంటే మాములు బ్యాడ్ టైం కాదు.. అందుకే ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న నిఖిల్ శ్వాస సినిమా షూటింగ్ కూడా ఆగిపోయిందనే న్యూస్ ఫిలింసర్కిల్స్‌లో వినబడుతుంది. ఈమధ్యనే మొదలైన శ్వాస సినిమా షూటింగ్ ఆగిపోవడం నిఖిల్ కే కాదు...విన్నవారందరికి షాక్. అయితే శ్వాస సినిమా షూటింగ్ ఇప్పటివరకు జరిగింది చూస్తే.. అది అనుకున్నట్టుగా రాకపోవడంతో శ్వాస సినిమా షూటింగ్ నిలిపివేసినట్టుగా టాక్. అసలే అర్జున్ సురవరం సినిమా విడుదల కాక బాధపడుతున్న నిఖిల్ కి ఇది పెద్ద షాకే.
అర్జున్ సురవరం సినిమా పలుమార్లు వాయిదాపడి ఆగిపోవడంతో... నిఖిల్ క్రేజ్ కొద్దిగా తగ్గింది. ఇక ఇప్పుడు శ్వాస సినిమా షూటింగ్ కూడా ఆగిపోతే నిఖిల్ క్రేజ్ పూర్తిగా 0 స్థాయికి పడిపోవడం ఖాయం. ఇక శ్వాస సినిమా షూటింగ్ ఆగిపోవడంతో.. ఇక నిఖిల్ కాస్త ధైర్యం చేసుకుని కార్తికేయ 2 షూటింగ్ లో పాల్గొంటున్నాడు.