మిస్టర్ కేకే ట్రైలర్ టాక్.. ఇండియన్ జేమ్స్ బాండ్ చియాన్ విక్రమ్
డిఫరెంట్ కాన్సెప్ట్ కథలకి, విభన్నమైన పాత్రలకి ఇంపార్టెన్స్ ఇస్తూ పాన్ ఇండియా వైడ్ ఆడియెన్స్ ను ఎంటర్ టైన్ చేస్తున్నారు చియాన్ విక్రమ్... ఇదే నేపథ్యంలో తాజాగా చియాన్ విక్రమ్ మరో హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. యూనివర్సల్ హీరో కమల్ హాసన్ నిర్మాతగా, రాజేష్ ఎం సెల్వా దర్శకత్వంలో తెరకెక్కిన కందరం కొండన్ లో విక్రమ్ మరోసారి తన నట విశ్వరూపం చూపించనున్నారు. ఈ సినిమా తెలుగులో మిస్టర్ కే కే అనే టైటిల్ తో రాబోతుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఇప్పటికే విడుదలైన టీజర్ తో ఇదో సీరియస్ యాక్షన్ థ్రిలర్ అనే కథను చెప్పకనే చెప్పిన చిత్ర బృందం, ట్రైలర్ ను ఓ విజువల్ ఫీస్ట్ గా రెడీ చేశారు. కమల్ చిన్న తనయ అక్షర హాసన్ ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే, ఆమె చుట్టూనే సినిమా స్టోరీ ఉన్నట్లుగా ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది.
ఇక మోడ్రన్ అండ్ స్టైలిష్ స్పై అవతార్ లో విక్రమ్ లుక్స్, యాక్షన్ సీన్స్ ఈ సినిమాపై ఉన్న అంచనాల్ని పెంచేలా కనిపిస్తున్నాయి. జేమ్స్ బాండ్ లేటెస్ట్ మూవీ స్పెక్టార్ లో మాదిరిగా కార్ ఛేజింగ్ ఎపిసోడ్స్ ఆడియెన్స్ ను మెప్పించడం ఖాయమనే అనిపిస్తోంది. వెరసి ఓ అల్ట్రామోడ్రన్ స్పై థ్రిల్లర్ లో మిస్టర్ కేకే గా చియాన్ విక్రమ్ అలరించబోతున్నాడు. ఇక ఈ స్పై థ్రిల్లర్ కి తగ్గట్లుగానే జిబ్రాన్ నేపథ్య సంగీతం, మిస్టర్ కేకే లో ఉన్న విజువల్స్ ని ఎలివేట్ చేసింది. ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఎక్స్ పీరియన్స్ ను ప్రేక్షకులకి అందించడానికి దర్శకుడు రాజేష్ ఈ సినిమాను ఆద్యంతం అద్భుతమైన థ్రిల్లింగ్ సన్నివేశాలతో తెరకెక్కించినట్లుగా తెలుస్తోంది, అదే రేంజ్ లో ట్రైలర్ సైతం ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు దర్శకుడు. తన గత సినిమా చీకటి రాజ్యంలో కూడా యాక్షన్ నేపథ్యంగానే రూపొందించిన రాజేష్ మరోసారి అదే పంధాను మిస్టర్ కేకే కు కొనసాగించారు. ట్రైలర్ తో ఫుల్ క్రేజ్ రాబట్టుకున్న మిస్టర్ కేకే జూలై 19న మరి ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి. తెలుగులో ఈ సినిమా పారిజాత మూవీ క్రియెషన్స్ పై టి.అంజయ్య సమర్పణలో టి.నరేశ్ కుమార్, టి.శ్రీధర్ నిర్మాతలుగా విడుదల అవుతుంది. ప్రముఖ రచయిత శశాంక్ వెన్నెలకంటి ఈ సినిమాకు డైలాగ్స్ అందించారు, రామ జోగయ్య శాస్త్రి లిరిక్స్ సమకూర్చారు. నిర్మాతలు టి.నరేశ్ కుమార్, టి.శ్రీధర్ ఈ సినిమాను తెలుగునాట భారీ స్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
టెక్నీషియన్స్ లిస్ట్
మ్యూజిక్.. జిబ్రాన్
పి ఆర ఓ.. ఏలూరు శ్రీను
సమర్సణ.. టి.అంజయ్య
నిర్మాతలు... టి.నరేష్ కుమార్ అండ్ టి. శ్రీధర్
రచన, దర్శకత్వం .. రాజేష్ ఎం సెల్వ
డైలాగ్స్.. శశాంక్ వెన్నెలకంటి
లిరిక్స్.. రామ జోగయ్య శాస్త్రీ