సమంత ఓ బేబీ సినిమా రేపు శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సమంత -నందిని రెడ్డి కాంబోలో తెరకెక్కిన ఓ బేబీ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. దానికి కారణం ఓ బేబీ ట్రైలర్ అయితే మరో కారణం సమంత ప్రమోషన్స్. ఓ బేబీ సినిమాని సమంత ఓ రేంజ్ లో ప్రమోట్ చేస్తుంది. ఇక సురేష్ బాబు కూడా పక్కా ప్లాన్ తో ఓ బేబీని మంచి డేట్ కి విడుదల చేస్తున్నాడు. అయితే నిన్నటివరకు ఓ బేబీకి శ్రీహరి కొడుకు రాజ్ దూత్, ఆది సాయి కుమార్ బుర్రకథ లు పోటీకి వస్తాయనుకున్నారు. కానీ శ్రీహరి కొడుకు రాజదూత్ మాత్రం వాయిదాపడింది. సకాలంలో సెన్సార్ చేయకపోవడంతో ఆ సినిమా వాయిదా పడిందని సమాచారం.
ఇక ఆది సాయికుమార్ బుర్రకథతో సమంతకి పోటీకి వస్తున్నాడు. ఆది సాయికుమార్ ఇప్పటివరకు భారీ డిజాస్టర్స్ తో ఉన్నాడు. కానీ బుర్రకథ ట్రైలర్ చూసాక సినిమాలో విషయముందనే అవగాహనకు ప్రేక్షకులు వచ్చారు. అయినా సమంతని తట్టుకుని ఆది సాయికుమార్ ఎంతవరకు నిలుస్తాడనే దాని మీద చాలా డౌట్ ఉంది. ఎందుకంటే ఆది సాయికుమార్ మీద సమంత క్రేజ్ భారీగా ఉండడం, ఆమె టాప్ హీరోయిన్ కావడం, అలాగే ఓ బేబీ సినిమా మీద మంచి అంచనాలు ఉండడం, ప్రమోషన్స్ పీక్స్ లో ఉండడం వంటి వాటితో పోలిస్తే... ఆది సాయికుమార్ బుర్రకథకు అంత సీన్ లేదనిపిస్తుంది. ట్రైలర్ ఎంతగా ఆకట్టుకుని.. ప్రమోషన్స్ లో బుర్రకథ టీం, ఓ బేబీ కన్నా వెనుకబడే ఉన్నారు. మరి రేపు ఈపాటికి ఓ బేబీ దా, లేదంటే బుర్రకథ దా హవా అనేది తెలుస్తుంది.