పూరి జగన్నాధ్ తన సినిమాల్లో హీరోయిన్స్ ని ఓ రేంజ్ లో చూపిస్తాడనే విషయం తెలిసిందే. గ్లామర్ గా హాట్ గా చూపించడంలో పూరి జగన్నాధ్ దిట్ట. ఇక పూరి సినిమాల్లో హీరోలు కాస్త మాస్ స్టయిల్లో డిఫ్రెంట్ గా కనిపిస్తారు. అలాగే హీరోయిన్స్ కూడా తమ కెరీర్ లో చూపించని యాంగిల్స్ చూపిస్తారు. తాజాగా పూరి జగన్నాధ్ తన ఇస్మార్ట్ శంకర్ లో హీరోయిన్ ని హాట్ గా కాదు చాలా ఘాటుగా చూపించబోతున్నాడు అనే విషయం ఇస్మార్ట్ శంకర్ ట్రైలర్ చూస్తే తెలిసింది. ఇస్మార్ట్ గర్ల్స్ గా నిధి అగర్వాల్, నభ నటేష్‌లు మాములుగా గ్లామర్ ఒలకబొయ్యడం లేదు. సవ్యసాచి, మిస్టర్ మజ్ను సినిమాలో చాలా ట్రెడిషనల్ గా కనిపించిన నిధి అగర్వాల్ ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ లో మాత్రం హీరో రామ్ తో ఘాటైన రొమాంటిక్ యాంగిల్ లో కనిపిస్తుంది. బీచ్ ఒడ్డున హాట్ హాట్ అందాలు ఆరబోస్తూ అందరిని పిచ్చెక్కిస్తుంది.
ఇక నన్ను దోచుకుందువటే సినిమాలో సుధీర్ బాబు కి జోడిగా క్యూట్ గా ట్రెడిషనల్ గర్ల్ గా కనిపించిన నభ సోషల్ మీడియాలో మాత్రం హాట్ హాట్ యాంగిల్స్ లో రెచ్చిపోయి ఫోటో షూట్స్ చేపించుకుంది. ఇక ఆ ఫోటో షూట్స్ తోనే ఇస్మార్ట్ శంకర్ లో ఆఫర్ కొట్టేసింది నభ. మరి ఈ సినిమాలో నభ మాములు రొమాంటిక్ కాదు... ఘాటైన రొమాంటిక్ యాంగిల్స్ లో రామ్ తో రెచ్చిపోయి నటించింది. అసలు నిధి అగర్వాల్, నభ నటేష్ చేసిన రొమాంటిక్ ఎక్స్‌పోజింగ్ ని చూసిన వారు అమ్మో ఇస్మార్ట్ పోరీలు మరీ ఈ రేంజ్‌లోనా అంటున్నారు. మరి ట్రైలర్ లో కేవలం శాంపిల్ చూసిన ప్రేక్షకులు.. సినిమాలో ఫుల్ మూవీని చూసి ఎంజాయ్ చెయ్యడానికి వెయిట్ చేస్తున్నారు.