Advertisementt

9వ నెల.. అయినా సమీరా ఆగడాలకు అంతే లేదు!

Fri 05th Jul 2019 07:45 PM
sameera reddy,baby bump,swimming suit,photoshoot,heroine sameera reddy  9వ నెల.. అయినా సమీరా ఆగడాలకు అంతే లేదు!
Sameera Reddy Hot Photoshoot with Baby Bump 9వ నెల.. అయినా సమీరా ఆగడాలకు అంతే లేదు!
Advertisement
Ads by CJ

ఎన్టీఆర్ సరసన ‘అశోక్, నరసింహుడు’.. చిత్రాలలో నటించిన సమీరా రెడ్డి.. కెరీర్‌లో సక్సెస్ కాక ఒక వ్యాపార వేత్తని పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యింది. చిరు, ఎన్టీఆర్ లాంటి హీరోలతో నటించినా క్రేజ్ తెచ్చుకోలేని సమీరా రెడ్డి బాలీవుడ్‌లోనూ సక్సెస్ అవ్వలేదు. అయితే పెళ్లి చేసుకున్న సమీరా రెడ్డి ఒక బిడ్డకు తల్లవడమే కాదు.. ఇపుడు మరో బిడ్డని కూడా తన కడుపులో మోస్తుంది. అయితే తానూ ప్రెగ్నెంట్ అని చెప్పడానికి ఏమాత్రం జంకని సమీరా.. పబ్లిక్ ఫంక్షన్స్ లోను తాను ప్రెగ్నెంట్ గా ఉన్నపుడు హాట్ హాట్ డ్రెస్సులతో ఫోటో గ్రాఫర్స్ కి ఫోజులిచ్చింది. ఇక మొన్నీమధ్యనే శ్రీమంతం ఫంక్షన్ ని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకుంది. 

మరి ఆ బేబీ బంప్ తోనే సమీరా రెడ్డి స్విమ్ సూట్ తో స్విమ్మింగ్ ఫూల్ దగ్గర చక్కర్లు కొట్టిన ఫొటోస్ ఆమధ్యన సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. తాజాగా తొమ్మిది నెలలు నిండిన సమీరా రెడ్డి.. ఒక హాటెస్ట్ ఫోటో షూట్ తో సోషల్ మీడియాని షేక్ చేసింది. నీళ్లలో ఫీట్లు చేస్తూ బికినీ తో హాట్ ఫోట్స్ కి కూల్ గా ఫోజులిచ్చింది. తనకు ఇప్పుడు తొమ్మిదో నెల అని...  చాలా మంది ఆ విషయం చెప్పడానికి భయపడతారని.. కానీ తానూ దాన్నుంచి బయటపడేందుకే ఈ ఫోటో షూట్ చేశానని చెప్పుకొచ్చిందీ. 

మరి ఈ టైం అంటే తొమ్మిదోనెలలో ఇలాంటి స్విమ్మింగ్ ఫూల్ ఫోటో షూట్స్ అవసరమా తల్లి అంటూ చాలామంది సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. అయినా వెరవని సమీరా తన ఘాటైన స్విమ్ సూట్ తో మతులు పోగొడుతుంది. ఇకపోతే తాను బేబీని కన్నాక కూడా మళ్ళీ సినిమాలలో నటిస్తానని సమీరా రెడ్డి మీడియాతో చెప్పిన విషయం తెలిసిందే. మరి బేబీ బంప్ తోనే ఇంత హాట్ ఫొటోస్ కి ఫోజులిచ్చిన సమీరా మళ్ళీ సినిమాల్లోకొచ్చాక ఎలాంటి అందాలు చూపిస్తుందో చూడాలి.

Sameera Reddy Hot Photoshoot with Baby Bump:

Sameera Reddy Hot Photoshoot Creates Sensation in Social Media

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ